టిడిపి – బిజెపి విడిపోకుంటే… జనసేన ఏం చేసేది..?

Why Pawan Kalyan Targeting TDP only not BJPగత కొన్ని రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఉన్నట్లుండి పవన్ ఇలా వ్యవహరించడంపై బిజెపి ఉందన్న ఆరోపణలను టిడిపి గట్టిగా వినిపిస్తోంది. చాలావరకు ఇవి నమ్మశక్యంగా ఉండడంతో ఇదే భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. దీనికి సరికొత్త లాజిక్ ను కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

టీడీపీ ఎప్పుడైతే బిజెపిని విడిచి బయటకు వచ్చిందో అప్పటి నుండి తమపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అంతేగాక ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారని, ఈ ప్రణాళిక మొత్తం బిజేపిదేనని ఆరోపించారు. నిజమే… గతంలో ఇవే వ్యాఖ్యలు బిజెపి నేతల నోటి వెంట రావడం గమనించదగ్గ అంశమే.

టిడిపిని విమర్శలు చేసినంతగా మోడీపై పవన్ స్పందించకపోవడం కూడా దీనికి బలాన్నిస్తోంది. మోడీ మాట పక్కన పెడితే, కనీసం బిజెపిని విమర్శించడానికి కూడా పవన్ నోరు రావడం లేదంటే… అంతేకదా… ఎవరిని వాళ్ళు ఎలా తిట్టుకుంటారు? మరి బిజెపితో టిడిపి తెగతెంపులు చేసుకోకుండా ఉంటే ‘జనసేన’ అధినేత ఏం చేసేవారో? ఏముంటుంది… అప్పుడు అంతా అభివృద్ధి, సంక్షేమమే కనపడేదేమో!?

ADVERTISEMENT
Latest Stories