టిడిపి నుంచి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి రాసిన లేఖ టిడిపి వర్గాలను ఆనందంలో ముంచెత్తగా, ఇతరులకు కాస్త విస్మయం కలిగించింది.నిన్నటిదాకా,టిడిపి తెలంగాణ,ఎపి నేతలతో తీవ్ర ఘర్షణ పడ్డ రేవంత్ ఆ విషయాలు ఏమీ ఆ లేఖలో ప్రస్తావించలేదు. ఎన్టీఆర్ ఆదర్శలను, చంద్రబాబు పోరాటపటిమను రేవంత్ పొగడ్తలతో ముంచెత్తారు.
ఆయన ఆ ఉత్తరం రాసిన తీరుపై కొందరు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు .కెసిఆర్ ను విమర్శించడాన్ని అర్దం చేసుకోవచ్చు. కాని చంద్రబాబును ఈ సమయంలో అతిగా పొగిడి, ఆయన తరపునే కాంగ్రెస్ లో చేరుతున్నారన్న భావన కలిగించారని, ఇవన్ని హై కమ్యాండ్ దృష్టికి తెస్తాం అని వారు అంటున్నారు.
సహజంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేరిక పై ఆ పార్టీ నేతలు చాలామంది గుర్రుగా ఉన్నారు. ఈ లేఖను వారు అస్త్రంగా మలుచుకోనున్నారు. వీటిని అన్నిటినీ కాంగ్రెస్ హై కమ్యాండ్ నమ్మితే రేవంత్ రెడ్డికు కొంచెం ఇబ్బంది అవ్వొచ్చు కూడా. ఈ నెల 31న రేవంత్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు.
వచ్చే 6నెలలో కోడంగల్ ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఆ ఉపఎన్నికలో రేవంత్ ని ఓడించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ రేవంత్ గెలుస్తే కాంగ్రెస్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న బాహుబలి దొరికినట్టే! ఆనుకోకుండా తెలంగాణా రాజకీయాలను కొత్త మలుపు తిప్పడు రేవంత్.
ఈ ఎన్నిక ఆధారంగానే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి హోదా నిర్ణయం అవుతుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో రేవంత్ ఓడిపోతే కాంగ్రెస్లోని శతకోటి లింగళ్లో ఆయనో బోడి లింగంగా మిగిలిపోవడం ఖాయం. కాబట్టి వచ్చే కోడంగల్ ఉపఎన్నిక రేవంత్కు జీవన మరణ సమస్య.


