Will Jagan Plan Work Out?

జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికలకు ముందు అంతంత ప్రగల్భాలు పలికి ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ఏ మొహం పెట్టుకొని ప్రజల మద్యకు రాగలరు?అసలు రాష్ట్రంలో ఉంటారా విదేశాలకు పారిపోతారా? అని అనుకున్న వారందరూ జగన్‌ గురించి చాలా తక్కువ అంచనా వేశారనే చెప్పవచ్చు.

Also Read – జయభేరీకి హైడ్రా నోటీస్‌… నో వర్రీస్ మేము రెడీ

ప్యాలస్‌లో నెలరోజులు మేధోమధనం చేసిన తర్వాత ఇకపై ఏవిదంగా ముందుకు సాగాలో మార్గం కనిపెట్టిన్నట్లే ఉన్నారు. చేతిలో ఉన్న బలమైన మీడియా, సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని గట్టిగా దుష్ప్రచారం చేస్తూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ తప్పటడుగులు వేసేలా చేయడమే వ్యూహామని జగన్‌ తాజా ట్వీట్‌ స్పష్టం చేస్తోంది.

ఇప్పటికే వినుకొండ బురదని చంద్రబాబుకి పూసేందుకు బయలుదేరారు. ఆలోగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ మీడియా సంస్థలని ట్యాగ్ చేస్తూ జగన్‌ ఓ ట్వీట్‌ వేశారు.

Also Read – వినాయక మంటపాలతో కూడా రాజకీయాలా… యాక్!

దాని సారాంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. శాంతి భద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో వైసీపిని అణగద్రోక్కేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. చంద్రబాబు నెలన్నర రోజుల పాలనలోనే రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, భౌతిక దాడులు, విధ్వంసం, రాజకీయ కక్ష సాధింపులే కనిపిస్తున్నాయి. వినుకొండలో జరిగిన హత్య ఇందుకు తాజా నిదర్శనం. ఏపీ సిఎం మరియు కొందరు అధికారులే ఈ హింసను ప్రేరేపిస్తున్నారు.

అందువల్ల రాష్ట్రంలో గూండాలు, హంతకులు యధేచ్చగా తిరుగుతున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ అరాచకాలపై సీబీఐ దర్యాప్తు అవసరం. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. వినుకొండలో టిడిపి గూండా దాడిలో చనిపోయిన షేక్ రషీద్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాను.

Also Read – కేసీఆర్‌ ఊసుపోక యాగాలు చేయలేదు స్మీ!

టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌, ది హిందూ, బీబీసీ ఇండియా, ఎన్‌డీటీవీ తదితర జాతీయ మీడియా సంస్థలకు కూడా జగన్‌ ఈ సందేశం పంపించారు.

దీనిని గమనిస్తే జగనేదో యధాలాపంగా శాంతి భద్రతలు క్షీణించాయని మాట్లాడటం లేదని, ఇది ఆయన తాజా రాజకీయ వ్యూహామని అర్దమవుతుంది.

నేడు కాకపోతే రేపైనా చంద్రబాబు ప్రభుత్వం తనపై రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందని జగన్‌కు ముందే తెలుసు. కనుక జగన్‌ రాష్ట్రం విడిచి పారిపోతారని అందరూ అనుకున్నారు. కానీ టిడిపి కంటే ముందే, టిడిపి కంటే చాలా వేగంగా ఈ వ్యూహంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసి ఎదురుదాడి చేస్తూ తన జోలికి రాకుండా చేయాలని జగన్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

కనుక వైసీపిని ఓడించి జగన్‌ని గద్దె దించామని టిడిపి నేతలు చంకలు గుద్దుకుంటే సరిపోదు. ఇకనైనా జగన్మోహన్‌ రెడ్డిని ధీటుగా ఎదుర్కొని కట్టడి చేయాలని, అధికారంలో ఉన్నా ఇంకా ఈ బేలతనం సరికాదని టిడిపి మద్దతుదారులు సోషల్ మీడియాలో పదేపదే హెచ్చరిస్తున్నారు.

అయితే జగన్‌ వ్యూహం అర్ధం చేసుకోలేనంత అమాయకుడు కారు సిఎం చంద్రబాబు నాయుడు. టిడిపి నేతలు, కార్యకర్తలను కట్టడి చేసి ఉంచితేనే, వైసీపి ఈవిదంగా అవకాశాలు సృష్టించుకుని రెచ్చిపోతోంది. అదే… ఆయన టిడిపి కళ్ళెం వదిలితే వారు కూడా రెచ్చిపోతారు. అప్పుడు జగన్‌ దుష్ప్రచారం చేస్తున్నట్లు రాష్ట్రంలో నిజంగానే శాంతి భద్రతలు క్షీణిస్తాయి.




కనుక జగన్‌ వ్యూహానికి చంద్రబాబు నాయుడే ప్రతివ్యూహం అమలుచేసి కట్టడి చేయాల్సి ఉంటుంది. కానీ పాలన పనులతో తీరికలేదని ఉపేక్షిస్తే జగన్‌ వైరస్ రాష్ట్రమంతా వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని మరిచిపోకూడదు.