పవన్ కళ్యాణ్ థర్డ్ ఫ్రంట్ లోకి వెళ్తారా?

Will Pawan Kalyan alliance with Third Frontతెలంగాణలో అదికార టిర్ఎస్ కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం కాదని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రస్థాయిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేసేందుకు తాజాగా నిర్ణయించినట్లు మరియు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాం అని తమ్మినేని చెప్పారు.

ADVERTISEMENT

ఫ్రంట్‌లో అన్ని వామపక్షాలను, సామాజిక సంస్థలు, మేధావులు, కళాకారులను కలుపుకొని ముందుకు వెళతామని చెప్పారు. ఇందుకోసం ప్రొఫెసర్‌ కోదండరాం, జస్టిస్‌ చంద్రకుమార్, పవన్‌ కల్యాణ్‌ తదితరులతో చర్చలు జరుపుతామన్నారు. అయితే పవన్ కళ్యాణ్ దీనికి ఒప్పుకుంటారా అనేది చూడాలి.

స్వతాహా కమ్యూనిస్ట్ భావజాలానికి పవన్ కళ్యాణ్ చాల దగ్గర. అయితే చేష్టలు అడిగి, వయసు మళ్ళిన కమ్యూనిస్ట్ పార్టీలతో ఆయన జతకడతారో లేదో చూడాలి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన పార్టీ కార్యాచరణ మొదలు పెట్టింది లేదు. చూదాం ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందో?

ADVERTISEMENT
Latest Stories