sri-reddy-rgv-posani

వైసీపీ సోషల్ మీడియా బరితెగింపు పై కూటమి ప్రభుత్వంలో వచ్చిన చలనంతో వైసీపీ సోషల్ మీడియా సైకోలుగా పిలవబడే కొంతమంది గతంలో తాము చేసిన తప్పులు క్షమించి విడిచిపెట్టాలంటూ కాళ్లబేరానికి వచ్చారు.

మరికొంతమంది వారి వారి సోషల్ మీడియా అకౌంట్లను రద్దు చేసుకుని మూటాముల్లె సర్దుకున్నారు. వైసీపీ పార్టీ మీద ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే ఇదంతా చేశామంటూ మమ్మల్ని విడిచిపెట్టాలంటూ దండాలు పెట్టి మరి వేడుకుంటున్నారు.

Also Read – హింసలోనే క్రెజ్ వెతుకుతున్న ప్రేక్షకులు, దర్శకులు…!

ఎన్నికల ఫలితాలకు ముందు రోజు కూడా వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది అనే భావంతో కూటమి నేతల మీద బరితెగించి వీడియోలు చేసిన ఈ అమాయకులు ఇప్పుడు తప్పయింది క్షమించండి అంటే విడిచిపెట్టాలా.? వైసీపీ ఓటమి చెందినప్పటికీ వీరి అరాచకాలకు ఎండ్ కార్డు వేయకుండా విషయాన్ని తెగేదాకా లాగి ఇప్పుడు తూచ్ మాకు సంబంధం లేదంటే దాన్ని కూటమి ప్రభుత్వం స్వాగతించాలా.?

మీ స్థాయి వ్యక్తులతో రాజకీయం యుద్ధం చేయండి సార్…మేమంతా పిచ్చిక మీద బ్రహ్మాస్త్రాలా.? అంటూ పత్తిత్తు కబుర్లు చెపుతున్న వారు తమ స్థాయి కి తగ్గ మాటలు మాట్లాడారా.? అనేది ఒక్కసారి గుర్తెరగాలి. తమ స్థాయికి తగ్గ వారితో విభేదించారా.? అప్పుడు గుర్తు రాని స్థాయి ఇప్పుడెందుకు గుర్తించాలి.?

Also Read – కేసీఆర్‌, కేటీఆర్‌ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?

ఒక వేల వీరు భావించినట్లే రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే వీరు వాడే భాషకు, వీరు చేసే సోషల్ మీడియా పోస్టులకు ఏపీ ప్రజానీకం సమాజం ముందు సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చేది. సినీ దర్శకుడిగా ఎదిగి సమాజాన్నికులాల వారీగా విభజించి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, వంగవీటి అంటూ సినిమాలు తీసి రెండు వర్గాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేసారు ఆర్జీవీ.

అక్కడితో ఆగకుండా వైసీపీ మెప్పు కోసం చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి అగ్ర నాయకుల మీద మార్ఫింగ్ పోస్టులు పెడుతూ తన సోషల్ మీడియాలో గత ఐదేళ్లు పైశాచిక ఆనందం పొందిన ఆర్జీవీ వైసీపీ ఘోర ఓటమితో తోక ముడిచి ఇక నాకు రాజకీయాలకు సంబంధం లేదు అంటూ పక్క తప్పుకుంటే అతడిని క్షమించాలా.?

Also Read – అయితే కొడాలి నానికి ముహూర్తం పెట్టేసినట్లేగా?

ఇక పోసాని కృష్ణ మురళి విషయానికి వస్తే, మదమెక్కిన గాడిద మాదిరి బహిరంగంగా మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడి మీద, పవన్ కళ్యాణ్ మీద, వారి కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యలు క్షమార్హత పొందగలిగేవేనా.? వీరి అహానికి, వీరి బరితెగింపుకి ఐదేళ్లు నరకం చూసిన వారి మనోభావాలకు విలువలేదా.? వారి కుటుంబాలు కార్చిన కన్నీటికి లెక్క లేదా.?

ఎంతో కష్టపడి ఈ పోటీ ప్రపంచంలో ఎందరినో దాటుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకుని సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న వారి జీవితాలను బజారుకు లాగే హక్కు వీరికెవరిచ్చారు.? తమ వారు పదవిలో ఉంటే పెట్రేగిపోయిన వారు తమ ప్రాణాల మీకు వస్తే మాత్రం క్షమించండి అంటూ దండాలు పెట్టి కాళ్లబేరానికి వస్తున్నారంటే తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే వీరి కుక్క బుద్ది వంకర కాకుండా ఉంటుందా.? కూటమి ప్రభుత్వం ఆలోచించాలి.