81 మరో 71 అవుతుందా..?

Virat Kohli

టీం ఇండియా రన్ మెషీన్, క్రికెట్ కు ‘కింగ్’, ఎందరో అభిమానులకు ఆరాధ్య దైవం, విరాట్ ఆటకు క్రికెట్ విశ్లేషకులు,ఎక్స్పర్ట్స్ ఏ కాక తాజాగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చంద్రబాబు నాయుడు’ గారు అన్-స్టాపబుల్ షో లో “ఐ ఆల్ వేస్ ప్రిఫర్ విరాట్” అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇది ఇలా ఉండగా, క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టి సుమారు ఏడాది కాలం కావస్తుంది. 2023 వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజీలాండ్ పై కొట్టిన సెంచరీయే ఆయనకు చివరి అంతర్జాతీయ సెంచరీ. అది నవంబర్ 15 ’23 న జరగగా, అప్పటి నుండి కోహ్లీ బ్యాటు నుండి మరొక సెంచరీ రాలేదనే వాస్తవం ఫ్యాన్స్ లో మళ్ళీ దిగులును నింపేస్తుంది.

ADVERTISEMENT

గతంలో, కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో కరోనా వల్ల వచ్చిన విరామం తరువాత విరాట్ బ్యాటు కాస్త ఫామ్ తప్పింది. 2020,21 సంవత్సరాలు సెంచరీ లేకుండానే గడిచాయి. అయితే సెప్టెంబర్ 8 2022 లో ఆఫ్ఘన్ తో కొట్టిన సెంచరీ తో విరాట్ మళ్ళీ తన బాట్ పవర్ చూపించి ఫామ్ అందుకున్నాడు.

అక్కడి నుండి వచ్చిన 12 మాసాలలో 10 సెంచరీలు కొట్టి మునుపటి ఫామ్ ను తిరిగి పొంది కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ విమర్శకుల ప్రసమాలు పొందారు. అయితే మళ్ళీ వరల్డ్ కప్ ముగిసిన తరువాత తన ఫామ్ కాస్త తగ్గినా, ఐపీఎల్ లో విజృంభించి బ్యాటింగ్ చేసారు విరాట్.

వస్తున్న టి-20 వరల్డ్ కప్ లో అదరగొడతారు అనుకుంటే టోర్నీ అంత ఫెయిల్ అయ్యి, అత్యంత కీలకమైన ఫైనల్ లో నాణ్యమైన ’76 ‘ పరుగులు చేసి తన ప్రాముఖ్యత ఏంటో చూపించాడు. గతంలో పిల్లలు పాలు తగినంత సులువు గా సెంచరీలు కొట్టిన విరాట్ ను చుసిన అభిమానులు, ఇప్పుడు ఇలా గాడి తప్పి బ్యాటింగ్ చేస్తుంటే చూడలేకపోతున్నారు.

అప్పుడు ఎలా అయితే ఒక్క సెంచరీ వచ్చాక అదే వరుసలో మరొక 10 సెంచరీలు వచ్చి పడ్డాయో, ఈ సారి కూడా మొదటిగా ఆ ఒక్కటి వస్తే చాలు, ఆ వెనుక వచ్చే సెంచరీల వరద ఆగదు అంటు ఆ ఒక్క సెంచరీ కోసం ఆశాజీఫ్ ఎదురుచూస్తున్నారు కోహ్లీ అభిమానులు. ముఖ్యంగా విరాట్ ఔట్ అవుతున్న విధానం అభిమానులను కలవరపెడుతుంది.

న్యూజిలాండ్ తో తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసేలా కనపడినా, దురదృష్టం కొద్ది వికెట్ ఆట ముగిసే ఆఖరి బంతి కి పెవిలియన్ బాట పట్టారు. ఇప్పుడు జరుగుతున్న న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్, వచ్చే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ భారత్ కు ఎంతో కీలకం, చూడాలి మరి అతి ముఖ్యమైన ఈ రెండు నెలల కాలం లో విరాట్ బ్యాటు ను మరల విదిలిస్తాడా లేదా అని..?

ADVERTISEMENT
Latest Stories