Jagan memes on social media

వైసీపీ నేతల ప్రచార ఆర్భాటాలు ఏ స్థాయికి చేరాయంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్శనకు రాష్ట్రంలో 13 జిల్లాలో ACA ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ ల మీద వైస్ జగన్ బొమ్మలు, వీడియోలు దర్శనమిచ్చాయి.చివరికి వరల్డ్ కప్ మ్యాచ్ కు కూడా మినహాయింపు లేదు అన్న చందంగా సందర్భాన్ని గట్టిగానే వాడుకున్నారు వైసీపీ నేతలు.

ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ బిగ్ స్క్రీన్ ల మీద ఆట మధ్యలో వచ్చే విరామ సమయంలో ఇలా జగన్ చిత్రాలను ప్రదర్శించడం వైసీపీ ప్రభుత్వ వీడియోలను ప్లే చేయడం చూస్తుంటే వైసీపీ పార్టీ రాజకీయ ప్రచారానికి వరల్డ్ కప్ ను అవకాశంగా తీసుకున్నారు ACA పెద్దలు అనే విమర్శను మూటకట్టుకున్నారు.అసలు క్రికెట్ అస్సోసియేషన్ కు రాజకీయాలతో ఏం సంబంధం అంటూ విమర్శిస్తున్నారు క్రికెట్ అభిమానులు.

అయినా క్రీడలతో కూడా రాజకీయమేనా? కనీసం ఇక్కడితో శాంతించిన పరవాలేదు కానీ ఇంతకూ మించి సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు వైసీపీ అభిమానులు. గతంలో ఎప్పుడో జగన్ బ్యాట్ పట్టుకుని ఒక షాట్ కొట్టిన వీడియో ని పోస్ట్ చేస్తూ “ఇప్పుడు ఇండియా టీమ్ కు నువ్వు కావాలి”…. అంటూ మీమ్స్ తగిలించారు వైసీపీ ఫాన్స్. అయితే ఈ మీమ్స్ చూస్తున్న నెటిజన్లు మాత్రం ఇంతకీ మీరు జగన్ ను తిట్టారా? పొగిడారా?అంటూ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు.

వైసీపీ పార్టీకి చెవిలో దూరిన ఈగ మాదిరి విసిగించే RRR మాత్రం జగన్ బొమ్మ స్క్రీన్ మీద పడడంతోనే ఇండియాకు బాడ్ టైం స్టార్ట్ అయ్యిందని అందువల్లే టీం ఇండియా ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిందంటూ తన వ్యంగ్యాస్త్రాలను వైసీపీ మీద వదిలారు. అలాగే ఇక జగన్ వ్యతిరేక వర్గం కూడా ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను మరోలా వాడుకుంటూ వైసీపీ పార్టీని ట్రోల్ చేస్తున్నారు.

రోహిత్ సేన మీరు మన దేశానికి వరల్డ్ కప్ తీసుకురాలేక పోయినందుకు బాధపడకండి. మా జగనన్న ఏపీ రాష్ట్రానికి ఎప్పుడో వరల్డ్ కప్ తెచ్చేసారు అంటూ జగనన్న రాష్ట్రానికి తెచ్చిన “వరల్డ్ కప్ మందు బాటిల్”..,తో జగన్ ప్రభుత్వాన్ని రాగింగ్ చేస్తున్నారు.ఇలా స్క్రీన్ లు పెట్టి తన రాజకీయ ప్రచారం చేసుకోవాలని భావించిన వైసీపీ పార్టీకి ప్రచారం అయితే జరిగింది కానీ అది ఆ పార్టీ నేతలు ఆశించిన ప్రచారమైతే కాదు.

ఏదేమైనా ఈ వరల్డ్ కప్ టీం ఇండియా ఓటమి భాద నుండి “సరదాగా కాసేపు నవ్వుకోవడానికి.,చిల్ అవ్వడానికి ” ఈ సోషల్ మీడియా పోస్టులు బాగానే వర్క్ అవుట్ అయ్యాయి.