
అధికారం కోసం అరువులు చాచినప్పుడు అదే పంధా..అధికారంలో ఉన్నప్పుడే అదే పద్దతి…ఇప్పుడు అధికారం పోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడ దక్కని పరిస్థితులలోను అదే విష ప్రచారం. ఒకరకంగా జగన్ కు ఈ స్థాయి ఓటమి రావడానికి వైసీపీ సోషల్ మీడియా కూడా తన వంతు కృషి చేసిందనే చెప్పాలి.
అసలు విషయానికి వస్తే..,గత ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన పేరుతో విద్యార్థులకు అందించే కిట్ల మీద గత ప్రభుత్వ ఆనవాళ్లు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉన్నాయని వాటి పంపకాల మీద పునరాలోచనలో పడ్డ అధికారులకు ప్రస్తుత ముఖ్యమంత్రి బాబు ఎటువంటి ఆలోచనకు తావివ్వకుండా వాటిని లబ్ది దారులకు అందించాలని ఆదేశమిచ్చారు.
Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?
అయితే గత ప్రభుత్వ గుర్తింపు ఉండకూడదు అనే అహంకారంతో 5 కోట్ల భవిష్యత్తును సమాధి చేయడానికి ఒక క్షణం కూడా ఆలోచించని జగన్ ఇప్పుడు బాబు చేసిన పనిని అభినందించాల్సింది పోయి తన సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టించారు. జగన్ ఫోటో ఉన్న కారణంగా విద్యార్థులకు కిట్లని పంపిణి చేయకుండా కొన్ని కోట్ల ప్రజా ధనాన్ని బాబు వృధా చేస్తున్నారంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుంది.
అలాగే గత ప్రభుత్వంలో జగన్ తీసుకువచ్చిన స్పందన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చిందంటూ, వైస్సార్ చేయూత ను ఎన్టీఆర్ చేయూతగా మార్చేసిందంటూ గగ్గోలు పెడుతుంది వైసీపీ సోషల్ మీడియా. మార్చడం గురించి మీరే చెప్పాలి మేమే వినాలి మరి అన్నట్టుగా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటూ వైసీపీ సోషల్ మీడియాకు కౌంటర్లు పేలుతున్నాయి.
Also Read – మోడీ “లీగల్లీ కన్వర్టర్ బీసీ”..?
గతంలో రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చినప్పుడు, ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం పేరును వైస్సార్ పేరుగా రూపాంతరం చేసినప్పుడు, అధికారంలోకి వచ్చింది రాష్ట్రమంతా పార్టీ రంగులు వెసుకుంటాకే అన్నట్టుగా చెట్టును, పుట్టను కూడా వదలకుండా అన్నింటికి వైసీపీ రంగులు మార్చినప్పుడు, జగన్ చేసింది సంస్కరణలు అని గొప్పలు చెప్పుకున్న వైసీపీ ఇప్పుడు మాత్రం సంస్కారం లేదా అంటూ ప్రశ్నించడం చూస్తుంటే అసలు ఆ సంస్కారం అన్న పదానికి కనీసం అర్ధం తెలుసా వైసీపీ కి అనిపించక మానదు.
అయితే వైసీపీ చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాల మీద స్పందించిన ఏపీ ఫాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. ఏపీలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి 2015 లో పబ్లిక్ గ్రీవెన్క్ రిడ్రెసల్ సిస్టం ను తొలిసారిగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టారని ఇప్పుడు తిరిగి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పాత విధానాన్నే కొనసాగించడం జరుగుతుందని వివరణ ఇచ్చింది ఏపీ ఫాక్ట్ చెక్.
Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?
దీనితో ఇప్పటికైనా వైసీపీ సోషల్ మీడియా తన చిల్లర వేషాలు కట్టిపెట్టాలంటూ నెటిజన్లు సలహాలిస్తున్నారు. ఇక సజ్జల సలహాలు నమ్ముకుని మళ్ళీ అదే ధోరణిలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ జగన్ మరో ఛాన్స్ కోసం ఎదురు చూడడం అంటే సాక్షిలో వాస్తవాలు చూపించినంత అసాధ్యం అవుతుంది అనేది జగన్ గ్రహించాలి.