‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ, తన క్యారెక్టర్ తో మరింత పాపులర్ అయ్యారు. మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే విజయ్, గతంలో టీవీ9 యాంకర్ కు ఎవరూ చెప్పలేని విధంగా బదులిచ్చాడు. దీంతో ఎప్పుడూ అతిధులను ఇబ్బందుల్లో పెట్టే సదరు యాంకర్, విజయ్ డైలాగ్స్ తో డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది.
అంతటి సెన్సాఫ్ హ్యుమర్ కలిగిన విజయ్ దేవరకొండ, ట్విట్టర్ లో చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘నాకు కూడా బ్యాక్ లాగ్స్ ఉన్నాయి అబ్బా. ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేద్దామని అనుకున్నా… కాని 5 సంవత్సరాల తర్వాత యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది’ అంటూ చేసిన ట్వీట్ ట్విట్టర్ లో బాగా పేలింది. ఇదంతా తన తాజా చిత్రం ‘ఏ మంత్రం వేసావే’ గురించి పరోక్షంగా చేసిన ఎటకారపు ట్వీట్.
ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై విమర్శల పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో వచ్చిన గుర్తింపును కొనసాగించడంలో విజయ్ దేవరకొండ విఫలం అయ్యారనేది ప్రధాన విమర్శ. అయితే ఇది ఇప్పటి సినిమా కాదని, అయిదేళ్ళ నాటి సినిమా అని, దానినే ‘బ్యాక్ లాగ్స్’గా విజయ్ అభివర్ణించారని నెటిజన్లు ఇస్తోన్న రిప్లైలతో సదరు ట్వీట్ వైరల్ అవుతోంది.



