‘రంగస్థలం’ ఆల్బమ్ నుండి విడుదలైన తొలి పాట ‘ఎంత సక్కవున్నావే’ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాట విజువల్ గా కూడా ‘ఎంత సక్కగున్నాదో’ తాజాగా తెలిసిపోయింది. ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతోన్న సందర్భంగా రిలీజ్ చేస్తోన్న వీడియో సాంగ్ ప్రోమోలలో భాగంగా ఇప్పటికే రెండు పాటలకు సంబంధించిన ప్రోమోలు విడుదల కాగా, తాజాగా ‘ఎంత సక్కగున్నావే’ పాట వంతు వచ్చింది.
ఎంతో సహజమైన విజువల్స్ తో గోదావరి సంస్కృతిని ప్రతిబింబిస్తూ చిత్రీకరించిన ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్స్ చూడముచ్చటగా ఉన్నాయి. గోదావరి నదిలో కదిలాడే నీటి లయ మాదిరి ఈ పాట విజువల్స్ ఉండడం విశేషం. చెర్రీ నాచురల్ స్టెప్స్ కు తోడు రామలక్ష్మిగా సమంత హావభావాలు ఎంతో క్యూట్ గా ఉన్నాయి. ఈ మూడవ పాట వీడియో సాంగ్ ప్రోమోతో ఖరారైన అంశం ఏమిటంటే… ఈ సినిమాలో పాటలు విజువల్ గా అద్భుతంగా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది.



