అవినాష్ రెడ్డి తల్లిని కర్నూలులోనే ఎందుకంటే…

Avinash-Reddy-Vivekananda-Reddyవివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో ఆమెము కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్లో చేర్పించారు. సోమవారం విచారణకు హాజరుకావలసిందిగా సీబీఐ మళ్ళీ నోటీస్ ఇస్తే తన తల్లి ఆరోగ్యం బాగోలేనందున ఈరోజు కూడా విచారణకు హాజరుకాలేనని తెలియజేశారు.

దీంతో సీబీఐ అధికారులు కర్నూలు చేరుకొని ఎస్పీ కృష్ణకాంత్‌ని కలిసి అవినాష్ రెడ్డిని లొంగిపోవలసిందిగా కోరారు. కానీ డిజిపితో మాట్లాడిన తర్వాత ఏ విషయమూ తెలియజేస్తానని చెప్పడంతో సీబీఐ అధికారులు ఉదయం నుంచి ఎస్పీ సమాధానం కోసం ఇంకా కర్నూలులో ఎదురుచూస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

అవినాష్ రెడ్డికి వైసీపీ కార్యకర్తలు రక్షణగా హాస్పిటల్‌ వద్ద నిలిచి ఉండటంతో సీబీఐ అధికారులు ఎస్పీ సహాయం కోరవలసిరావడం విస్మయం కలిగిస్తుంది. కనుక ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీ పోలీస్-సీబీఐ మద్యకు మారిందని భావించవచ్చు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ డ్రామాపై స్పందిస్తూ, “అసలు అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యానికి అవినాష్ రెడ్డి అరెస్టుకి సంబందం ఏమిటి? అంటే సీబీఐ ఎవరినైనా అరెస్ట్‌ చేయాలంటే ముందుగా నిందితుల తల్లితండ్రులు, భార్యాపిల్లలు, బంధుమిత్రులు అందరి ఆరోగ్యపరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలా?

అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్లయితే, ఆమెను హైదరాబాద్‌కు తీసుకువస్తూ మద్యలో కర్నూలుకు తీసుకువెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఎందుకు చేర్చారు? తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అయితే అవినాష్ రెడ్డి ఈ ఆటలు చెల్లవని, కర్నూలు ఏపీలో ఉంది…. ఏపీలో వైసీపీ రాజ్యం ఏలుతోంది. కడప నుంచి అవినాష్ రెడ్డి అనుచరులు కర్నూలు చేరుకోవడం సులువు. అక్కడ వారు ఏం చేసినా చెల్లుతుందనే కదా?” అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

సీబీఐ అధికారులు హాస్పిటల్‌ వద్ద వైసీపీ కార్యకర్తల రక్షణ కవచం దాటుకొని వెళ్ళి అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు భయపడుతున్నారంటే పరిస్థితి అర్దం అవుతోందన్నారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయబోతోందని అవినాష్ రెడ్డి ముందస్తు సమాచారం ఏమైనా లభించిందా? అందుకే ఏదో సాకుతో విచారణకు హాజరుకాకుండా తప్పించుకొంటున్నారా? అనే రఘురామకృష్ణరాజు ప్రశ్న చాలా ఆలోచింపజేస్తోంది. సీబీఐ అధికారులు సోమవారం మధ్యాహ్నం మళ్ళీ ఎస్పీ కృష్ణకాంత్‌ని కలిసి అవినాష్ రెడ్డిని అప్పగించవలసిందిగా కోరగా ఇంకా డిజిపి నుంచి ఆదేశాలు అందలేదని చెప్పిన్నట్లు సమాచారం. దాదాపు రోజు గడిచిపోయింది కనుక మళ్ళీ రేపు మంగళవారం ఇదే కధ మొదలవుతుందేమో?

ADVERTISEMENT
Latest Stories