లోకేష్ జగన్ ను కంగారుపెట్టాడా?

YS Jagan Aerial survey on Polavaram flood affected areas టీడీపీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేష్ నిన్న పశ్చిమ గోదావరిలోని వరద బాధిత ప్రాంతాలలో పర్యటించాడు. జిల్లా ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించి వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా రైతుల పట్ల ప్రభుత్వ స్పందన శూన్యమని, వరదలు వస్తాయని తెలిసీ ముందస్తు సహాయక చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు.

ADVERTISEMENT

పలువురు బాధితులు చంద్రబాబు హయాంలో సహకార్యక్రమాలు బాగా అందేవని, నిత్యావసరాల కొరత ఉండేది కాదని చెప్పారు. అయితే ఈ ప్రభుత్వం కనీసం చర్యలు చేపట్టలేదని వారు నారా లోకేష్ తో చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఉన్నఫళంగా వరదకు గురైన పోలవరంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే అనంతరం అధికారులతో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. వరద బాధితుల సాయంపై ఆరాతీసిన జగన్, బాధిత కుటుంబాలకు రూ. 5 వేలు ఇవ్వాలని ఆదేశించారు.

లోకేష్ పర్యటన వల్ల, వస్తున్న విమర్శలకు భయపడి జగన్ ఉన్నఫళంగా ఏరియల్ సర్వే చేసారని టీడీపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. ఢిల్లీ పర్యటన ఇంకో రోజు పొడిగించుకున్నామని, జగన్ ఈరోజు అనంతపురం, కడప జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ఈరోజే వచ్చేసి ఏరియల్ సర్వేకు వెళ్లారు. ఇంతకూ కియా మోటార్స్ కార్ లాంచ్ కు ముఖ్యమంత్రి జగన్ ఎందుకు చివరి నిముషంలో వెళ్ళలేదు అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories