jagan-sharmila

ఏపీలో అధికార టీడీపీ కూటమికి వైసీపీకి మద్య ఎలాగూ రాజకీయ ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. ఇదికాక ఏపీ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ షర్మిలకి వైసీపీకి అంటే ఆమె అన్న జగన్మోహన్ రెడ్డికి మద్య కూడా సమాంతరంగా మరో యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Also Read – ఇంతకీ కేజ్రీవాల్‌ మంచోడా కాదా?

అధికార పార్టీకి ప్రతిపక్షపార్టీ సవతి పోరు ఎలాగూ తప్పదు కానీ ప్రతిపక్ష పార్టీకి కూడా చెల్లి పోరు తప్పడం లేదు. జగన్‌ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని నిలదీస్తుంటే, అన్నని చెల్లి షర్మిల అంతకంటే గట్టిగా నిలదీస్తుండటం విశేషం.

టీడీపీ నేతలు చేయాల్సిన పోరాటాన్ని కూడా ఆమె చేస్తుండటం విశేషం.

Also Read – టిడిపికి కోటి దండాలు.. సభ్యత్వాలు!

జగన్‌ అక్రమాలు, అవినీతి వరుసగా బయటపడుతున్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కానీ ఇంత అవినీతిపరుడైన మా అన్నని ఇంకా ఎప్పుడు లోపల వేస్తారని వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుండటం విశేషం.

అదానీ నుంచి జగన్‌ రూ.1,750 కోట్లు ముడుపులు తీసుకున్నారని తెలిసినా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆమె ప్రశ్నించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిననట్లు తెలిసినా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Also Read – సంక్రాంతి గేమ్ చేంజర్‌ వెంకటేషే… మళ్ళీ విక్టరీ!

తన అన్న జగన్‌ ఏకంగా పోర్టులు, సెజ్‌లను కబ్జా చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజవేస్తున్నారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

తన అన్న అదానీతో లులూచీ పడి ముడుపులు తీసుకుంటే ఆ ఒప్పందాన్ని, ఆ కంపెనీని రద్దు చేయాల్సిన కూటమి ప్రభుత్వం, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆ భారాన్ని వేయడాన్ని వైఎస్ షర్మిల తప్పు పట్టారు.

అవినీతికి పాల్పడిన జగన్‌ ఎలాగూ ఈ విషయం గురించి మాట్లాడలేరు. కనీసం ప్రభుత్వమైనా తగు చర్యలు చేపట్టకపోతే ఎలా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెంటికీ ప్రజల సమస్య పట్టదు కనుక తానే కేంద్ర ప్రభుత్వానికి (సెకీ)కి లేఖ వ్రాసి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు చేయాలని కోరుతానని వైఎస్ షర్మిల అన్నారు. తాను జగన్‌ అవినీతి, అక్రమాల గురించి ప్రశ్నిస్తుంటే, వ్యక్తిగత కక్షతోనే ఈవిదంగా మాట్లాడుతున్నానని బొత్స సత్యనారాయణ అనడంపై కూడా ఆమె ఘాటుగా స్పందించారు.

ఇంతవరకు తాను జగన్‌ అవినీతి గురించి మాత్రమే మాట్లాడుతున్నానని అదే.. వ్యక్తిగత విషయాలు మాట్లాడితే జగన్‌ ప్యాలస్‌లో నుంచి కాలు బయటపెట్టలేరని వైఎస్ షర్మిల అన్నారు. అంటే జనాలకు తెలియని రాజకోట రహస్యాల ఇంకా చాలా ఉన్నాయన్న మాట!




ఏది ఏమైననప్పటికీ ప్రతిపక్ష పార్టీకి మరో ప్రతిపక్ష పార్టీ అదీ… సొంత చెల్లెలు పక్కలో బల్లెంలా మారడం విచిత్రంగానే ఉంది కదా?