హై కోర్టుకు జగన్ కోడి కత్తి కేసు…

ys-jagan-attack-case-in-high-courtప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్టు లో కోడి కత్తితో జరిగిన దాడి ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణను ఉమ్మడి హైకోర్టు వాయిదా వేసింది. జగన్‌ దాడి కేసును స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశించాలంటూ ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ADVERTISEMENT

[m9ad]

ఇంతకు ముందు జగన్ కూడా తమకు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదని చెప్పి విచారణకు సహకరించడం లేదు. ఈ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. మరో వైపు నిందితుడికి చెందిన మూడు బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నామన్నారు పోలీసులు.

శ్రీనివాసరావు కత్తిని జనవరిలోనే తెచ్చి హోటల్‌ కిచెన్‌లో దాచాడని, తన దస్తూరి బాగున్నప్పటికీ ఇతరులతో లేఖ ఎందుకు రాయించాడనేదానిపై దృష్టి పెట్టామని వారు పేర్కొన్నారు. మరోవైపు హీరో శివాజీపై విజయవాడ కమిషనర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ గరుడ వ్యాఖ్యలపై శివాజీని విచారించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్‌పై దాడి జరుగుతుందని, శివాజీకి ముందే ఎలా తెలుసో చెప్పాలని వైసీపీ నేతలు నిలదీశారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి కేసులో శివాజీ పాత్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories