కులం కూడు పెట్టదు – కష్టం కన్నీరును మిగల్చదు!

Jagan First Appearance

కులరహిత సమాజం అన్నది దేశక్షేమం, సంక్షేమం కోరుకునే నాయకుల కల. కానీ కులాలను రెచ్చగొడుతూ, తద్వారా తమ పబ్బం గడుపుకోవడం అనేది నేటి రాజకీయ నాయకులు ప్రజలకు వేస్తోన్న వల.

ADVERTISEMENT

అందులో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే… గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూ, కేవలం ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ పరిపాలన చేస్తోన్న జగన్ మోహన్ రెడ్డి అన్న పేరు వస్తుంది.

పూర్వం నుండి ప్రజలలో మమేకం అయిపోయి, పెనవేసుకుపోయిన కులాల రొచ్చుని అణిచివేయకపోగా, మరింతగా ప్రోత్సహిస్తూ, తన అయిదేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నారు.

కేవలం ‘కమ్మ’ అనే ఒక సామాజిక వర్గాన్ని అణగద్రొక్కాలనే లక్ష్యంతో ఈ అయిదేళ్ల అధికారాన్ని వినియోగించుకున్న జగన్, ఆ సామాజిక వర్గంతో ‘కాపు’ కలవకూడదని చివరి నిముషం వరకు ప్రయత్నాలు చేసారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైపోతుందన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే ప్రముఖ పదవులు ఇవ్వడంతో పాటు, సలహాదారులు, సహాయకులు పేర్లతో లేని పదవులను సృష్టించి మరీ ‘రెడ్డి’ వర్గాన్ని పెంపొందించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు లేక నిరుద్యోగం పెచ్చుమీరిపోగా, కూలీ చేసుకునే వారికి కనీస పనులు లేక విలవిలలాడిపోయారు. ఈ ఆవేదనే పోలింగ్ సమయంలో ఉత్సాహాన్నిచ్చి 82 శాతం నమోదయ్యేలా చేసింది.

ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే… కాస్తో కూస్తో చదువుకున్న విజ్ఞానవంతులు మరియు సోషల్ మీడియాలకు బానిస అయిన నేటి యువత జగన్ కు సానుకూలంగా మాట్లాడుతుండడం వెనుక ‘కులం’ అనే రాక్షసి దాగి ఉంది.

దీంతో తమపై జరుగుతున్న అరాచకానికి మరో కులానికి చెందిన వాళ్ళు కూడా మాటలతో ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితికి ఏపీ ప్రజానీకాన్ని తీసుకువచ్చేసారు తెలుగు కూడా సరిగా చదవడం రానటువంటి ముఖ్యమంత్రి వర్యులు!

“కులం కూడు పెట్టదు – కష్టం కన్నీరును మిగల్చదు” అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా కనపడుతోంది. ఈ రహదారిపై కాస్తో కూస్తో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు మాత్రమే పడుతున్నాయి.

కులాల మధ్య జగన్ మోహన్ రెడ్డి రగిల్చిన చిచ్చును ఆర్పడంతో పాటు, ఈ రొచ్చుని మరింతగా పెంపొందించకుండా చేయాల్సిన బాధ్యత ఇతర నాయకులైన చంద్రబాబు – పవన్ లపై ఉంది.

ADVERTISEMENT
Latest Stories