జగన్ వేస్తున్నవి జోకులా? ప్రగల్భాలా?

ys jagan comments on chandrababu naidu goermentగంటలో ప్రస్తుతం ఉన్న చంద్రబాబు సర్కార్ ను కూల్చివేసే సత్తా తనలో ఉందని ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఇప్పట్లో ఆగినట్లు లేదు. దీనిపై సోషల్ మీడియాలో పడుతున్న కామెంట్లకు కొదవలేదు. జగన్ ఈ మధ్య జోకులు కూడా వేస్తున్నారని కొందరంటుంటే… ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ కు అసహనం పెరిగిపోతోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సందడి చేస్తోంది.

“జగన్ లెక్కపెట్టుకో… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 14,898 గంటలు దాటింది… ఒక వైపు అధికారం కోసం ఆత్రం, మరోవైపు తమ నాయకులు చేజారిపోతారేమోనన్న టెన్షన్ తో గంటలు లెక్కపెట్టుకుంటూ స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నావని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు” అంటూ జగన్ చేసిన మాటలకు కౌంటర్లుగా పడుతున్నాయి. 21 మంది టిడిపి ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పిన జగన్ వ్యాఖ్యల వెనుక అసలు వాస్తవం… 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి వారితో టచ్ లో ఉండడమేనన్న మాటలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే, కర్నూల్ లో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది సైకిల్ జెండా పట్టుకోవడానికి సిద్ధమయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ప్రధానంగా వినపడుతున్న భూమా నాగిరెడ్డి నేడో రేపో ఒక అధికారిక ప్రకటన చేయవచ్చని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories