వైఎస్ జగన్ పాదయాత్ర ఈరోజుతో 2500 కిలోమీటర్ల మార్కు చేరింది. సరిగ్గా వైఎస్ జయంతి అయిన ఈరోజే ఆ మార్కు చేరుకునేలా ప్రణాళిక వేసుకుని సాధించారు. ఆరు నెలలపాటు 13 జిల్లాల్లో 3 వేల కిలోమీటర్లు 125 నియోజకవర్గాల్లో నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా పాదయాత్ర పది జిల్లాలైనా పూర్తి కాకుండానే 2500 కిలోమీటర్ల మైలురాయిని అందుకుంది.
ఆరు నెలల్లో పూర్తి చేయాలనుకున్నకోర్టు కేసుల కారణంగా ఎనిమిది నెలలు పూర్తయింది. పాదయాత్ర మీదే అన్ని ఆశలు పెట్టుకున్న పార్టీ జనసమీకరణ కోసం భారీగా ఖర్చుపెట్టి శక్తివంఛన లేకుండా కష్టపడింది. గతంలో ముఖ్యమంత్రులు అవ్వాలని పాదయాత్ర చేపట్టిన వైఎస్ గానీ చంద్రబాబు గానీ అధికారంలోకి రావడంతో అదే సెంటిమెంట్ తనకు కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నారు.
మరి కొన్ని రోజుల్లో ఆయన పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశిస్తుంది. మరి ఈ పాదయాత్ర ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెడుతుందో లేదో చూడాలి. ఈ సారి గనుక అధికారంలోకి రాకపోతే పార్టీని నడపడం కష్టం అవుతుందని జగన్ కు తెలియంది కాదు. దీనితో ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.



