ఏపీ ప్రభుత్వ ప్రతిపాదిత ఇళ్ల స్థలాల్లో పీకల్లోతు నీరు

జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే ఇళ్ల స్థలాల పథకం అభాసుపాలు అయ్యేలా ఉంది. ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం చేతలలో మాత్రం చిత్తశుద్ధి చూపించుకోలేకపోతుంది. గోదావరి జిల్లాలలో ఇళ్ల స్థలాలకు మార్కు చేసిన చాలా స్థలాలు నీట మునిగాయి.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు నాలుగు అడుగులకుపైగా నీరు నిలిచింది. ఇదే ప్రదేశంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం అధికారులు ఎనిమిదిన్నర ఎకరాల భూమిని సేకరించారు.

ADVERTISEMENT

ఇలాంటి స్థలాలు రెండు గోదావరి జిల్లాలలో చాలా ఉన్నాయి. ఈరోజు మీడియా ముఖంగా పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి స్థానిక టీడీపీ నేతలు నిరసన తెలిపారు. పేదలకు కేటాయించిన ఈ స్థలాల్లో స్థానిక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకొని ఉండగలరా? అని వారు ప్రశ్నించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఏదో ముప్పై లక్షల స్థలాలు ఇస్తున్నాం అని చెప్పుకోవడానికే గానీ ఇటువంటి స్థలాలు లబ్దిదారులకు ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ప్రభుత్వానికి మంచి పేరు రాక పోగా చెడ్డపేరు వస్తుంది. గావున ఇటువంటి ప్రతిపాదనలు వెనక్కు తీసుకోవడం మంచిది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే… ఇటువంటి వాటి మీద హైకోర్టు స్టే ఇస్తే అధికార పార్టీ కోర్టుని, ప్రతిపక్షాలను నిందించడం.

ADVERTISEMENT
Latest Stories