వైఎస్సార్ కాంగ్రెస్ అప్పుడు చేసిన ఆరోపణాలేంటి? ఇప్పుడు చేస్తున్న తప్పులేంటి?

YS Jagan Government Sand Mafiaచంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా అంటూ చాలా హడావిడి చేసింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయంతో ఆ అంశం పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా కూడా అవే ఆరోపణలు రావడం గమనార్హం.

ADVERTISEMENT

అయితే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయే తప్ప రాష్ట్రంలో ఇసుక మాఫియా లేనేలేదు అంటూ ఆ పార్టీ నాయకులు గట్టిగా నొక్కి చెబుతున్నారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గత నెల రోజుల్లోనే అక్రమ ఇసుక రవాణా విషయంలో 2,837 మందిని అరెస్ట్ చేశారు. 1,545 కేసులు నమోదుచేశారు. 3.85 లక్షల టన్నుల ఇసుక, 1,924 వాహనాలు సీజ్ చేశారు.

ఈ గణాంకాలు చెప్పింది ఎవరో కాదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావాన్గ్. కనీసం ఆయన చంద్రబాబు హయాంలో నియమించిన వ్యక్తి కూడా కాదు. అధికారంలోకి రాగానే జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి నియమించుకున్న అధికారి. దీని బట్టి రాష్ట్రంలో ఇసుక మాఫియా తీవ్రత అర్ధం అవుతుంది.

ఇసుక అక్రమ రవాణా అనేది అధికారులు, అధికారపక్ష నాయకులు అండ లేకుండా జరిగే అవకాశమే లేదు అనేది జగమెరిగిన సత్యం. గతంలో తామే ఇదే విషయంలో ఆరోపణలు చేసి…. మళ్ళీ అదే తప్పు చెయ్యడం అంటే తీవ్రమైన విషయమే. ఉన్నఫళంగా ముఖ్యమంత్రి జగన్ కలిపించుకోకపోతే ఆ పార్టీకే నష్టం.

ADVERTISEMENT
Latest Stories