ప్రశాంతత పాయే! కోరి కొరివి పెట్టించుకున్న జగన్!

YS Jagan in frustationఆంద్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు వైసీపీ అధినేత జగన్. పార్టీలో ఏర్పడుతున్న ప్రకంపనలతో జగన్ తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయని సమాచారం. పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా వీడుతూ జగన్ కు జలక్ ల మీద జలక్ లు ఇస్తూ… పార్టీ ఫిరాయించిన పనిని సమర్దిన్చుకోవడానికి కారణాలు కుడా సిద్దం చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

తాజాగా జగన్ కు జలక్ ఇవ్వడం శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ వంతైంది. దీంతో పార్టీ ఫిరాయిoచిన నేతల సoఖ్య తొమ్మిదికి చేరింది. వైఎస్సార్సీపీ నేతలు ఒక్కొక్కరిగా ‘ఫ్యాన్’కున్న పవర్ కట్ చేసి, విలాసాలకు దూరంగా రాష్ట్రం కోసం చెమటోడ్చడానికే మేమంతా ‘సైకిల్’ ఎక్కుతున్నామని జగన్ కు సంజాయిషీ ఇస్తున్నారు.

పార్టీలో జరుగతున్న ఫిరాయింపుల కన్నా ఆ నేతలు చెప్పే కారణాలతోనే జగన్ ఎక్కువగా అవాక్కవుతున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. ప్రశాంతంగా ఉన్న రాజకీయ జీవితాన్ని జగన్ “కోరుండి కొరివి పెట్టించుకున్న” చందంగా మార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories