అప్పుడు సలహాలు ఇవ్వడం చేతగాకనే అసెంబ్లీకి రాలేదా?

YS Jagan lost cool in Andhra Pradesh Assembly ఈరోజు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుండగా ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ సభ్యులు మొత్తం కలిపి 10 మంది కూడా లేరని, ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులు సభకు ఎందుకు వస్తున్నారో? అర్థం కవడంలేదని అన్నారు.

ADVERTISEMENT

స్పీకర్‌ను అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి దాడి చేస్తే.. ఆ ఘటనను రాజకీయం చేసి లబ్ధిపొందే దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సభ్యులు స్పీకర్‌ పోడియం రింగ్‌ దాటి వస్తే మార్షల్స్‌ ఎత్తుకెళ్లే పరిస్థితి తీసుకురావాలని సభపతికి సూచించారు.

టీడీపీ సభ్యులు 10 మంది ఉన్నారు.. వీళ్ల కంటే వీధి రౌడీలు చాల బెటర్‌ అని జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు మాట్లాడాలన్నా, ప్రభుత్వానికి నిర్ణయాత్మక సూచనలు చెయ్యడానికి సభకు రావాలి… చేత కాకపోతే బయటే ఉండాలి అని జగన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ పాయింట్ మీద సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ ను పెద్ద ఎత్తున ట్రాల్ చేస్తున్నారు.

“జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఎందుకు నిర్ణయాత్మక సూచనలు చెయ్యలేదు? ఎందుకు రెండు మూడేళ్ళ పాటు సభని బహిష్కరించారు. ముఖ్యమంత్రి చెప్పినదాని ప్రకారం సలహాలు ఇవ్వడం చేతగాకనే అసెంబ్లీకి రాలేదా? అప్పుడు చేతగాని ఇప్పుడు నీతులు చెబుతున్నారా? రెచ్చగొడితే దాడులు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా అనుకుంటున్నారా లేక ఇంకేమన్నానా?,” అని వారు విమర్శిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories