2017లో బిగ్ సర్ ప్రైజ్ ఇదే!

Aggressive Branding in YS Jagan Padayatra Inspired by Chandrababu Naidu2017వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. పట్టుమని పది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ పది రోజుల్లో అద్భుతాలేవీ జరగవు గానీ, ఈ గురువారం నాడు మాత్రం ఈ ఏడాది అతి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

‘సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం ఇస్తూ ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ, జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు” చెప్పిన చంద్రబాబు నాయుడు ట్వీట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. జగన్ కు ఒక టీచర్ మాదిరి రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలో చంద్రబాబు చూపిస్తున్నారంటూ చేసిన కామెంట్స్ కంటే… జగన్ పైన మరిన్ని హిలేరియస్ కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.

ADVERTISEMENT

అందులోకల్లా ముఖ్యమైనది… “సిఎం అయిన తర్వాత దీనికి రిప్లై ఇస్తాడేమో” అన్న కామెంట్ బాగా పండింది. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న జగన్, జనాల సమస్యలను వింటూ… తాను ముఖ్యమంత్రిని అవుతాను, అప్పటివరకు తట్టుకోండి… అంటూ ప్రసంగిస్తున్న విధానం తెలిసిందే. బహుశా ఈ ట్వీట్ కు అదే రిప్లై ఇస్తారేమో జగన్ బాబు గారు అంటున్నారు నెటిజన్లు. అసలు రిప్లై వస్తుందా? అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోండి..!

ADVERTISEMENT
Latest Stories