వైఎస్సార్ కాంగ్రెస్ తో పొత్తు వార్తలు… నైరాశ్యంలో బీజేపీ శ్రేణులు

YS- Jagan - Narendra Modiప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేపు ఉదయం 10.30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో కలవబోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ను ఎన్డీయేలో చేర్చుకునే క్రమంలో బీజేపీ అధిష్టానం జగన్ ను ఢిల్లీకి పిలిచిందని వార్తలు వస్తున్నాయి. ఎన్డీయేలో చేరిన క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఒక కాబినెట్, రెండు ఎంఓఎస్ పదవులు ఆఫర్ చేసినట్టు సమాచారం.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీవి రెండు పరస్పరవిరుద్ధమైన ఓటు బ్యాంకులు… ఈ క్రమంలో బీజేపీతో జగన్ కలిసే సాహసం చేస్తారా అనేది చూడాలి. మరోపక్క ఈ వార్తలపై బీజేపీ అభిమానులలో నైరాశ్యం మొదలయ్యింది. “ఇప్పుడిప్పుడే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలపడే ప్రయత్నం చేస్తుంది. ఈ తరుణంలో ఈ పొత్తువల్ల ఆ అవకాశం లేకుండా పోతుంది,” అని వారు అంటున్నారు.

ADVERTISEMENT

“ఏదైనా ఒక పార్టీ బలపడాలంటే ప్రజల తరపున ప్రభుత్వాలపై పోరాటాలు చెయ్యాలి. అధికారంలో ఉన్న వారితో పొత్తు పెట్టుకుంటే ఆ అవకాశం ఉండదు. టీడీపీ సమయంలో ఉన్నట్టు స్వపక్షంలో విపక్షంగా ఉన్నా దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. దీనితో పార్టీ శ్రేణులు పూర్తిగా నీరసపడిపోతారు,” అని వారి అభిప్రాయం.

ఇటీవలే హిందుత్వ కార్డుతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడే ప్రయత్నం చేస్తుంది. అవకాశాలు వస్తున్నాయో లేక అవకాశాలు కలిపించుకున్నటున్నారో గానీ… అవకాశాలైతే వస్తున్నాయి. ఈ తరుణంలో అధికారపక్షంతో పొత్తు అంటే ఇక ఆంధ్రప్రదేశ్ లో సమీపభవిష్యత్తులో బీజేపీకి అవకాశం లేనట్టే. అదే సమయంలో అవినీతి కేసులలో ఉన్న జగన్ తో పొత్తు అంటే కూడా అది బీజేపీకి అవమానమే.

ADVERTISEMENT
Latest Stories