
పోలింగ్ సమయంలో పలు జిల్లాలు అల్లర్లతో అట్టుడికిపోతుంటే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వాటి సంగతి వైసీపి నేతలు చూసుకుంటారన్నట్లు హాయిగా విదేశాలకు వెళ్ళిపోయారు.
పోలీసులు ఆ అలర్లను ఎలాగో నియంత్రించగలిగారు కానీ వైసీపి నేతల ఆక్రోశాన్ని ఎవరూ ఆపలేకపోయారు. వారి అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం విజయవాడ చేరుకున్నారు. కనుక ఇప్పుడు ఆయన వారందరికీ ధైర్యం చెప్పి ఓదార్చగలరు.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
జూన్ 4న వెలువడే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతుందని జగన్ ముందే చెప్పారు. కానీ దేశ ప్రజలు ఆశ్చర్యపోవడానికి అంత వరకు వేచి చూడనవసరం లేదు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచే వివిద మీడియా-సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ నివేదికలను ప్రకటించబోతున్నాయి.
దేశ ప్రజలు ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారేమో కానీ వైసీపి, టిడిపి కూటమి నేతలు ఆశ్చర్యపోకపోవచ్చు. ఎందుకంటే ఈసారి ఫలితాలు ఏవిదంగా ఉండబోతున్నాయో అందిరికీ తెలుసు కనుక.
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో మారిన రాజకీయ బలాబలాలు, మారిన కుల సమీకరణాలు, టిడిపి కూటమి నుంచి ఇంత గట్టి పోటీ తదితర అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే, వైసీపికి 75 సీట్లు రావడం కూడా కష్టమే అనిపిస్తోంది. కానీ వైనాట్ 175? అంటున్నారు. కనుక వైసీపికి అన్ని సీట్లు వస్తే దేశ ప్రజలు ఆశ్చర్యపోకుండా ఉండలేరు కదా?
పైన పేర్కొన్న పరిణామాల కారణంగానే ఈసారి టిడిపి కూటమి విజయావకాశాలు గణనీయంగా పెరిగాయని అర్దమవుతూనే ఉంది. కనుక 120కి పైనే సీట్లు గెలుచుకొని అధికారంలోకి రాబోతున్నామని టిడిపిలో చంద్రబాబు నాయుడుతో సహా అందరూ చాలా ధీమాగా ఉన్నారని చెప్పుకోవచ్చు.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
కనుక జూన్ 4న వైసీపి ‘చారిత్రిక ఓటమి’ తర్వాత ‘వాట్ నెక్ట్స్’?అని ఆలోచిస్తే టిడిపి ప్రతీకార జ్వాలలకు వైసీపి దహించుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ ఏవిదంగా పార్టీ నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారో, అదేవిదంగా వైసీపి క్యాడర్ చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవడానికి జగన్ మళ్ళీ ఓదార్పుయాత్ర చేపట్టక తప్పకపోవచ్చు. అయితే గత ఓదార్పు యాత్రలకు రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఓదార్పుయాత్రలకు చిన్న తేడా ఉంది.
ఇదివరకు ఆయన ప్రజలను ఓదార్చేందుకు యాత్రలు చేయగా, ఈసారి వారే తనని ఓదార్చుతారనే ఆశతో జగన్ ఓదార్పు యాత్రలు చేస్తారేమో?