మరి ఇంతలా ‘చులకనవ్వాలా’ సారూ..?

YS jagan

తమ ప్రత్యర్థులను ఇరుకునపెట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను అస్త్రాలుగా మార్చుకుని రాజకీయ రణరంగంలోకి దిగుతారు రాజకీయ నాయకులు. అయితే గెలుపే పరమావధిగా రాజకీయ విలువలకు తిరోధకాలిచ్చి ప్రతి చిన్న అంశాన్ని రాజకీయ కోణంతో ముడిపెట్టి విమర్శలు చేస్తే ఆ నాయకుడు ప్రజలలో పలుచన అవుతాడే తప్ప పేరు తెచ్చుకోలేదు.

ఈ అంశాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. తానూ ఒక పార్టీ అధినేతగా ఉంటూ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ మరో పార్టీ అధినేతను ఉద్దేశించి చేస్తున్న విమర్శలతో ప్రజలలో జగన్ బాగా చులకనవుతున్నారు అనే భావన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT

జగన్ తన ప్రతి సభలోను పవన్ వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేయడం, దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటూ ఎద్దేవా చేయడంతో అటు జనసైనికులతో పాటు ఇటు ప్రజలలో కూడా జగన్ తీరు పట్ల అసహనం వ్యక్తమవుతోంది. రాజకీయాలకు వ్యక్తిగత జీవితాన్ని ముడి పెట్టడం ఎంతవరకు సమంజసం అనే వాదన సర్వత్రా వినపడుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేస్తూ జగన్ మరో కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. మొన్నిఈమధ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కు తీవ్ర జ్వరం రావడంతో విశ్రాంతికి హైద్రాబాద్ వెళ్లారు. పవన్ ఇదేదో రాష్ట్రానికి చేసిన అన్యాయంలా, అవమానంగా ప్రజలను నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగా కాకినాడ మేమంతా సిద్ధం సభలో ప్రసంగించిన జగన్ పవన్ కు ఏపీ అంటే ఎంత చులకనంటే జ్వరం వస్తే హైద్రాబాద్ కు వెళ్లేంత చులకన చూసారా చెల్లి..? చూసారా అక్కా..? అంటూ పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.

అయితే గురివింద తన కింద మచ్చ పెట్టుకుని ఎదుటి వారి పై మచ్చ వేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో జగన్ కు అర్ధమయ్యే విధంగా కౌంటర్ ఇచ్చింది జనసేనపార్టీ. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు గా ఉన్న బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, విశ్వరూప్, విజయ్ సాయి రెడ్డి, రోజా ఆయా సందర్భాలలో అనారోగ్యం బారిన పడినప్పుడు సొంత రాష్ట్రంలో మెరుగైన సదుపాయాలు లేవు అనే ఉద్దేశంతో హైద్రాబాద్ వెళ్లి చికత్సలు చేయించుకున్న వీడియో లను పోస్ట్ చేసింది.

అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కూడా ఇక్కడి వైద్యుల పైన, పోలీసు అధికారుల మీద తనకు నమ్మకం లేదని హైద్రాబాద్ వెళ్లి అక్కడ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న దృశ్యాలను ఆ వీడియోలో పొందుపరిచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో వీడియో ను చూసిన వారంతా కోరుండి కొట్టించుకోవడం అంటే ఇదేనా..? అంటూ ఒక్క వీడియో తో ప్రజలలో ఇంతలా చులకనవ్వాలా సారూ…అంటూ జగన్ పై కామెంట్లు చేసున్నారు.

ADVERTISEMENT
Latest Stories