జగన్ నోట ముందస్తు మాట!

YS Jagan Says early electionsముందస్తు ఎన్నికల విషయం మళ్లీ తెర పైకి వచ్చింది. ఈసారి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి నోట. వచ్చే ఏడాది అక్టోబర్ లోనే ఎన్నికలు రావచ్చని, అందుకు పార్టీ అంతా సన్నద్దంగా ఉండాలని జగన్ తమ పార్టీ నాయకులకు లోటస్ పాండ్లో జరిగిన పార్టీ ఇన్ చార్జీల సమావేశంలో పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే చెబుతున్న విషయాన్ని వారికి గుర్తుచేశారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం కూడా అలాగే జరగవచ్చని ఆయన అన్నారు. 175 నియోజకవర్గాల్లో పార్టీని సంపూర్ణంగా సిద్ధంచేసే దిశగా అడుగులు వేయాలని ఆయన పార్టీ ఇన్ చార్జీల సమావేశంలో పేర్కొన్నారు.

ADVERTISEMENT

వచ్చే నెల 2 నుండి 120 నియోజకవర్గాలలో పాదయాత్ర చెయ్యనున్నారు జగన్. ఆ తర్వాత మిగిలిన ఏభై ఐదు నియోజకవర్గాలలో బస్ యాత్ర చేపడతారు. తనని తాను ముఖ్యమంత్రి పీఠం మీద చూస్కూనే ధృఢసంకల్పంతో ఆరు నెలల పాటు మూడువేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చెయ్యబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories