జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలని దూరంగా పెట్టి వాలంటీర్ల ద్వారా తానే ప్రజలతో కనెక్ట్ అవ్వాలనుకున్నారు. నేను బటన్ నొక్కుతాను… మీరు వెళ్ళి డబ్బులు పంచిరండని పంపిస్తుండేవారు. మద్యలో ఐప్యాక్, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు కూడా జగన్‌కి శల్య సారధ్యం చేస్తుండేవారు.
జగన్ చివరి వరకు ఇదే ఫార్ములాని అమలుచేయడంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇటు ప్రభుత్వంలో ప్రాధాన్యం, అటు ప్రజలలో గుర్తింపు లేకుండాపోయింది.
Also Read – టీడీపీకి ఇలాంటి రాజకీయాలు అవసరమా?
కానీ ఎన్నికలు దగ్గర పడిన తర్వాత తన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరగడానికి మంత్రులు, ఎమ్మెల్యేలే కారణమని నిందిస్తూ పలువురి మంత్రి పదవులు ఊడగొట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వకుండా నిరాకరించారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు, ఐప్యాక్, సజ్జల రామకృష్ణా రెడ్డివంటివారిని నమ్ముకొని గుడ్డిగా ముందుకు సాగి బోర్లాపడగా, ఇప్పుడు వైసీపి సోషల్ మీడియాని నమ్ముకొని ముందుకు సాగుతూ ఎదురుదెబ్బలు తింటున్నారు.
Also Read – జగన్ లక్కీ ఆర్ అన్ లక్కీ..?
వైసీపి సోషల్ మీడియాలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ల గురించి చాలా జుగుప్సాకరమైన ఫోటోలు, వ్యాఖ్యలు వస్తున్నాయి. అవన్నీ జగన్‌కి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా జరుగుతున్నాయని అనుకోలేము. కనుక జగన్ సూచన మేరకే వైసీపి సోషల్ మీడియాలో అంతగా చెలరేగిపోతోందని భావించవచ్చు. నేడో రేపో దానికీ వైసీపి మూల్యం చెల్లించక తప్పదు.
కానీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల మద్యకు వెళ్ళి వారి సమస్యలపై పోరాడాల్సిన జగన్, తాడేపల్లి ప్యాలస్‌లో సేద తీరుతూ ఈవిదంగా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై దుష్ప్రచారం చేయిస్తుంటే చాలు మళ్ళీ తాను అధికారంలోకి వచ్చేస్తానని కలలు కంటుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read – జగన్ దెబ్బకి రేషన్ బియ్యం నిలిచిపోయేలా ఉందే!
ఇటువంటి విచిత్రమైన జగన్ ధోరణి కారణంగానే ఎన్నికలలో వైసీపి ఓడిపోయింది. కానీ తన పద్దతే సరైనదని అని జగన్ నమ్ముతుండటమే కాక పార్టీలో అందరూ కూడా తనను గుడ్డిగా నమ్మి కూటమి ప్రభుత్వంతో యుద్ధం చేయాలని కోరుకుంటూ అందరి జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పక తప్పదు.