మూడు రాజధానుల విషయంలో సానుకూల తీర్పు రానుందని సీఎం కు సమాచారం ఉందా?

Jagan-three capitals
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ విశాఖపట్నం మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. విశాఖను మూడు రాజధానులలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా చెయ్యనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కోర్టులో ఆ కేసు పెండింగ్ ఉన్నా ప్రభుత్వం తెర వెనుక పని చేసుకుంటూ పోతుంది.

ఎప్పుడు అనుకూలంగా తీర్పు వచ్చినా వెంటనే తరలింపు జరపాలని జగన్ ఆలోచన. విజయనగరం జిల్లాలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బుధవారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్. ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో విజయనగరం వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం మళ్ళీ విశాఖ చేరుకున్నారు.

ADVERTISEMENT

ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికేందుకు ఎయిర్‌పోర్టులో వేచివున్న జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను తనతో విజయవాడ రావలసిందిగా సీఎం సూచించారు. హెలికాప్టర్ లో కలెక్టర్ అప్పటికప్పుడు జగన్ తో వెళ్లారు. జిల్లాకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడేందుకు కలెక్టర్‌ను జగన్ పిలిచారని సమాచారం.

రాజధాని ఏర్పాట్లపై ప్రముఖంగా చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం కోర్టులలో ఉండగా… ఎందుకు ఇంత సడన్ గా ముఖ్యమంత్రి కలెక్టర్ తో చర్చలు జరుపుతున్నారని సర్వత్రా చర్చ జరుగుతుంది. మూడు రాజధానుల విషయంలో ఏదైనా సానుకూల తీర్పు రానుందని ముఖ్యమంత్రికి సమాచారం ఉందా?

ADVERTISEMENT
Latest Stories