జగన్ తిరుమల యాత్ర… మళ్ళీ అదే హడావిడి మళ్ళి వివాదాస్పదం!

ys jagan Tirumala Tirupati Devasthanams visitప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువులను ఆకట్టుకునే క్రమంలో రకరకప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తన పాదయాత్ర మొదలు పెట్టేముందు తిరుమల శ్రీవారి దగ్గరకు కాలి నడకన వచ్చి దర్శించుకుంటా అని జగన్ చెప్పారు. అయితే చివరి నిముషంలో శుక్రవారం కోర్ట్ లో ఆలస్యం అయ్యిందని కార్ మీద కొండ మీదకు వెళ్లారు.

ADVERTISEMENT

అయితే ఆలస్యం అయ్యింది 3న, పాదయాత్ర ఉన్నది 6న ఈలోగా శ్రీవారి మొక్కు తీర్చుకోవడానికి జగన్ కు టైం లేదా అని భక్తుల అభిప్రాయం. జగన్ గత తిరుమల యాత్రలు ఎప్పుడు వివాదాస్పదం అవుతూ వచ్చాయి. ఈసారి కూడా అదే హంగామా. మందీమార్బలంతో జగన్ వైకుంఠ ద్వారం నుండి ఆలయ ప్రవేశం చేసారు.

ఈ సందర్భంగా టీటీడీ టిక్కెట్ల తనిఖీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. ఎల్ -2 టిక్కెట్టు కలిగిన వారిని కూడా ఎల్-1 లో అనుమతించిన సిబ్బంది. జగన్ తో పాటు వైకుంఠం మెయిన్ కాంప్లెక్స్ గుండా భారీగా ప్రవేశించిన అనుచరులు. వారిని తనిఖీలు సైతం చెయ్యని ఎస్ పి ఎఫ్ సిబ్బంది. వందల మంది ఒక్కసారిగా వస్తే ఎలా తనిఖీ చేస్తామని ఎస్పీఎఫ్ సిబ్బంది వివరించారు.

మరో వైపు ఏకంగా చెప్పులతో వైకుంఠం వద్దకు వచ్చిన వైసీపీ మహిళా నేత అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు. భద్రతా సిబ్బంది వారించడంతో అన్యమనస్కంగా చెప్పులను వదిలి వైకుంఠంలోకి ప్రవేశించిన మహిళా నేత. భారీగా అనుచరులు జగన్ తో ప్రవేశించడంతో కొంత మంది ఎమ్మెల్యేలు వైకుంఠంలోనే నిలిచిపోయారు.

నిబంధనల ప్రకారం అన్యమతస్థులు వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకునే ముందు డిక్లరేషన్ ఇవ్వాలి. అయితే డిక్లరేషన్‌పై సంతకం చేయమని టీటీడీ అధికారులు కోరినప్పటికీ జగన్ సంతకం చేయకుండానే వెళ్లిపోయారు. సోమవారం నుంచి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభంకానుంది.

ADVERTISEMENT
Latest Stories