జగన్, విజయసాయి రెడ్డి ఏడాదిన్నర పాటు జైలులో కలిసి ఏం చేశారు?

YSRCP MLA Vasantha Krishna Prasad praises -MP Kesineni naniవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో విడిగా రోజుకు చంద్రబాబు మీద విరుచుకుపడుతూ మూడు నాలుగు ట్వీట్లు వేస్తారు. అలా వెయ్యకపోతే ఆయనకు పొద్దు గడవదా అన్నట్టు క్రమం తప్పకుండా వేస్తారు. ఈరోజు కూడా చంద్రబాబుని, లోకేష్ ని టార్గెట్ చేస్తూ రెండు ట్వీట్లు వేశారు.

అయితే దానికి టీడీపీ ఎంపీ కేశినేని నాని గట్టిగానే సమాధానం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌లను ఉద్దేశిస్తూ క్వారంటైన్‌లో ఉన్న తండ్రి, కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారని.. కొడుకు దేనికీ పనికి రాడని తండ్రి నిర్దారణకు వస్తే.. తండ్రి ప్రతి విషయంలో బ్యాడే అని కొడుకు అంటున్నాడని సాయిరెడ్డి తీవ్రస్థాయిలో ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT

దీనికి తనదైన శైలిలో కేశినేని నాని కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఏ1, ఏ2లుగా ఏడాది కాలంపైగా జైల్లో కలిసి ఉన్న మీరిద్దరు ఏం తెలుసుకున్నారు’’ అంటూ ఘాటుగా విమర్శించారు. జనం సొమ్ము దోచుకోవడానికి మాత్రమే పనికొస్తారని తెలుసుకున్నారా అంటూ ట్వీట్ చేశారు.

అమిత్‌షా కాళ్లు పట్టుకునేందుకు చంద్రబాబు ప్లాన్‌ చేసుకుంటున్నారని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేయగా, అందుకేనా అపాయింట్‌మెంట్లు ఇచ్చినట్లే ఇచ్చి రద్దువుతున్నాయంటూ నాని కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here

ADVERTISEMENT
Latest Stories