జగన్ ‘బర్త్ డే’ సందర్భంగా చంద్రబాబుకు ‘కానుక’

YS jagan walk out from assemblyప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ ‘కానుక’ అందించారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడానికి నిత్యం అడ్డు తగులుతున్న జగన్, తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానుగా బయటకు వెళ్ళిపోయి సభ నిరాటంకంగా సాగడానికి పరోక్షంగా ప్రభుత్వానికి సహకరించారు. దీంతో సభలో ఎటువంటి వాగ్వివాదాలకు తావు లేకుండా పోయింది. “రోజాపై ‘సస్పెన్షన్’ ఎత్తివేయనందుకు కారణంగా ఈ శీతాకాల సమావేశాల నుండి పూర్తిగా వైదొలుగుతున్నామని” జగన్ ప్రకటించి, సీఎల్పీ భేటీ నిర్వహించుకున్నారు.

అంతకుముందు, రోజా ఉదంతంపై వ్యాఖ్యానించిన స్పీకర్, “రోజా సస్పెన్షన్ పై ప్రతిపక్ష పార్టీ కోరుతున్న పధ్ధతి సరైనది కాదు, తప్పు జరిగింది, మరోసారి ఇలా జరగనివ్వబోము, సస్పెండ్ ఎత్తివేయబోమని కోరితే పరిస్థితి బాగుండేదని, కానీ అలా కాకుండా, సభ తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆరోపించడం సరైన తీరు కాదని” జగన్ కు స్పష్టం చేసారు. స్వయంగా స్పీకరే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, జగన్ అప్పటికీ కూడా సభ తప్పు చేసిందని చెప్పి సభ నుండి వాకౌట్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories