వైరల్ వీడియో : ఒక ముద్దు… నాలుగు తీయటి మాటలు..!

YS Jagan wrong promises to peopleశుక్రవారం బ్రేక్ తీసుకుంటూ సాగిపోతున్న జగన్ “ప్రజా సంకల్ప యాత్ర”లో హామీల వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉన్నాయి. ఒకవేళ అధికారంలోకి వస్తే నిజంగా అమలు చేస్తారో లేదో గానీ, ప్రజల వద్ద మాత్రం తీయని కబుర్లు చెప్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతోందో అందరికీ తెలుసా… అంటూ మహిళలతో జగన్ చేసిన ముచ్చట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ADVERTISEMENT

“అధికారంలోకి రాగానే పెన్షన్ 2000 రూపాయలు అని అందరికీ చెప్పండి, అలాగే 45 ఏళ్ళకే పెన్షన్ అమలు చేస్తామని చెప్పండి, బాలికలను స్కూల్స్ కు పంపిస్తే ఏడాదికి 16 వేల రూపాయలు ఇస్తామని చెప్పండి…” అంటూ జగన్ తీయని మాటలు… యధావిధిగా ముద్దులు పెడుతూ రికార్డైన ఈ వీడియో వైరల్ అవ్వడంలో తప్పులేదేమో! అయితే ఇలాంటి వీడియోలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే అవకాశం లేదు. ఎందుకంటే ఈ పాదయాత్ర మరికొన్ని నెలల పాటు సాగనుంది కనుక, వీటికి సీక్వెల్స్ తధ్యం.

ADVERTISEMENT
Latest Stories