జగన్ కొత్త నిర్ణయానికి లబోదిబో అంటున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు

YSR-Congress-MLAs-To-Resign-for-Special-Statusప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైకాపా ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చెయ్యాలి అనే ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేసినందున వారికి సంఘీభావంగా ఎమ్మెల్యేలం కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం.

తద్వారా ప్రత్యేకహోదా పోరులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందు బాగాన ఉందన్న సంకేతం కూడా ఇచ్చినట్లు అవుతుందని ఈ ప్రతిపాదన చేసిన వారు చెబుతున్నారు. ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ ఈ నిర్ణయం పార్టీ ఎమ్మెల్యేలలో గుబులు లేపుతుంది. ఎన్నికలకు ఒక సంవత్సరం ఉండగా రాజీనామా చేస్తే నియోజకవర్గాలలో చిన్న చిన్న పనులు కూడా జరగకుండా పోతాయి.

ADVERTISEMENT

అదే విధంగా అధికారులు తమ మాట కూడా వినరని వారి భయం. ఇలాంటి పరిస్థితి ఎన్నికలకు ఒక ఏడాది ముందు ఉంటే నియోజకవర్గం ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని వారు భయపడుతున్నారు. ఇప్పటికే అటువంటి ప్రకటన ఏదైనా చేసే ఉద్దేశం ఉంటే దానికి ముందుగా తాము నేరుగా జగన్ తో మాట్లాడే అవకాశం ఇవ్వాలని వారు ఇప్పటికే పార్టీ పెద్దలతో చెప్పినట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories