వైరల్ : సమయం లేదు జగన్..! విలీనమా… కారాగారమా..?

YS Jagan YSRCP Alliance with BJPసామాజిక మాధ్యమాలలో నెటిజన్లు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడుదల అవుతున్న ప్రతి అంశాన్ని సామాజిక కోణంలో చూస్తూ అందుకు సంబంధిత వ్యక్తులను టార్గెట్ చేయడం నెటిజన్లకు వెన్నతో పెట్టిన విద్య. టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ అయితే ఫలానా సినిమా ‘కాపీ’ అంటూ సదరు సినిమాలను ఏకిపారేయడం, అలాగే రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం కొత్త విషయాలేవీ కావు.

ADVERTISEMENT

అందులో భాగంగానే సోషల్ మీడియాలో జగన్ కు సంబంధించిన ఓ అంశం ట్రోలింగ్ అవుతోంది. ఏపీ, తెలంగాణాలతో పాటు దేశ వ్యాప్తంగా “ఫాస్ట్ ట్రాక్ కోర్టు”లను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జగన్ లాంటి వ్యక్తులు ఇరుకున పడడం ఖాయమని సోషల్ మీడియాలో పడుతున్న పంచ్ లకు కొదవలేదు. ప్రస్తుతం వారానికొరోజు కోర్టుకు హాజరవుతున్న జగన్, త్వరలో రోజుకొకసారి హాజరయ్యే పరిస్థితి నెలకొంటుందని, అప్పుడు ప్రజా సమస్యల కంటే, తన సమస్యలను తీర్చుకునే క్రమంలో మునిగి తేలతారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… బిజెపిలో వైసీపీ విలీనం అయ్యేందుకు సరైన సమయమని… ఇక జగన్ కు మరో అవకాశం లేదని… “సమయం లేదు మిత్రమా… విలీనమా… కారాగారమా…” అంటూ వేస్తున్న పంచ్ లు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి పంచ్ లు ఒక్క జగన్ కే పరిమితం కాలేదు. కాకపోతే ప్రస్తుత వార్త జగన్ పై ఇలాంటి కౌంటర్లు వేసేలా చేస్తోంది… అంతే..!

ADVERTISEMENT
Latest Stories