‘మనం చేస్తే కాపురం అదే… ఎదుటవాడు చేస్తే వ్యభిచారం’ అన్నట్లు మాట్లాడారు సిఎం జగన్మోహన్ రెడ్డి. నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో బటన్ నొక్కి రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ, “వైసీపీ మ్యానిఫెస్టో ప్రజల అవసరాలు, కష్టాలు, ఈ మట్టి నుంచి పుట్టింది. కానీ చంద్రబాబు నాయుడు రెండు మూడు పార్టీల మ్యానిఫెస్టోలు కాపీ కొట్టి, వాటితో బిస్మిలా బాత్ వండేశారు. మన మ్యానిఫెస్టోని కూడా కాపీ కొట్టేసి పులిహోర కలిపేశాడు.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
టిడిపికి 175 స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేరు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం కూడా లేదు. అందుకే పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు దిక్కులు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుని చూస్తే రావణుడు, మారీచుడు గుర్తొస్తారు,”అంటూ మనసులో ఉన్న ద్వేషాన్ని, అసహ్యాన్ని వెళ్ళగ్రక్కారు.
తన ప్రసంగంలో ఎక్కువసేపు చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి, టిడిపి మ్యానిఫెస్టోని తప్పు పట్టడానికే సిఎం జగన్ సమయం కేటాయించడం చూస్తే, చంద్రబాబు నాయుడు వ్యూహాలతో, ట్రైలర్‌గా విడుదల చేసిన టిడిపి మ్యానిఫెస్టోతో జగన్ చాలా ‘డిస్టర్బ్’ అయిన్నట్లు అర్దమవుతోంది.
అయినా మట్టిలో నుంచి పుట్టిన వైసీపీ మ్యానిఫెస్టోని కాపీ కొట్టి టిడిపి మ్యానిఫెస్టో తయారుచేశారని వాదిస్తున్నడు, ఒకవేళ అది చెత్తది, పనికిరాదనుకొంటే వైసీపీ మ్యానిఫెస్టో కూడా పనికిరాదనే కదా అర్దం?వైసీపీకి దాని మ్యానిఫెస్టో బైబిల్ అయితే, టిడిపికి దాని మ్యానిఫెస్టో కూడా భగవద్గీత వంటిదే అవుతుంది.
అయినా టిడిపి పూర్తి మ్యానిఫెస్టో విడుదల చేయలేదు. కేవలం నాలుగైదు ముఖ్యమైన అంశాలనే ప్రస్తావించి ఆయావర్గాలకు హామీలు ఇచ్చింది. దానికే సిఎం జగన్ ఇంత ఆందోళన చెందితే, రేపు టిడిపి పూర్తి మ్యానిఫెస్టో విడుదల చేస్తే వైసీపీ పరిస్థితి ఏమిటి?
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
అయినా నాలుగేళ్ళలో రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ విధ్వంసం చేసేస్తూ, రాష్ట్రానికి రాజధాని లేకుండా, పరిశ్రమలు రాకుండా చేసి, మా అంత గొప్ప పాలకులు మరెవరూ లేరు. మా అంత గొప్ప ప్రభుత్వం మరొకటి లేదని భుజాలు చరుచుకోవడం వైసీపీ నేతలకే చెల్లు. ఒకవేళ జగనన్న చెప్పుకొంటున్నట్లు రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేస్తే అది తెలంగాణలో లాగా కంటికి కనబడాలి కదా?దేవతావస్త్రాల మాదిరిగా వైసీపీ నేతలొక్కరికే ఎందుకు కనిపిస్తోంది?
అకాలవర్షాలతో పంటలు దెబ్బతిని రాష్ట్రంలో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే కనీసం వెళ్ళి పలకరించలేదు. కానీ రైతుభరోసా పేరుతో నిధులు విడుదల చేసి రైతులను, వ్యవసాయాన్ని ఉద్దరిస్తున్నట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది కదా?