పవన్ – జగన్ లకు చీమ కుట్టినట్లుగా కూడా లేదే!

why-pawan-kalyan-and-ys-jagan-are-trs-friendsసర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం సాక్షిగా మరోసారి తెలుగు వారికి జరిగిన అవమానం హాట్ టాపిక్ గా మారింది. బిజెపి సర్కార్ నిరంకుశత్వానికి, తెలుగుపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిలపడంలో ‘మోడీ అండ్ కో’ పూర్తిగా విజయవంతం అయ్యారు. దేశ ఐక్యత అంటూ ఈ విగ్రహం ఏర్పాటు, బహుశా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను అవమానించినట్లే!

[m9ad]

ADVERTISEMENT

అయితే ఇవేమీ మన తెలుగు ప్రజానీకానికి పట్టవు. మోడీపై గుర్రుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వర్గీయులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కానీ వైసీపీ అండ్ జనసేనకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు. ముఖ్యంగా దేశ సమగ్రత, జాతి సమగ్రత అంటూ పెద్ద పెద్ద పదాలు వినియోగించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి ఈ విగ్రహం ద్వారా తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయం కనిపించట్లేదా? అంటే…

ఇటీవల కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు గనుక, మోడీ చేసిన ఈ అన్యాయం కానరాలేదేమో! ఒకవేళ కనిపించినా చేయగలిగేదేముంది? మోడీని విమర్శించే ధైర్యం లేకపాయే! ఇక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడీ అండ్ అమిత్ షా కనుసన్నల్లో తన పార్టీని నడిపిస్తున్నారని ఇప్పటికే తెలుగు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయిన దరిమిలా దీనిపై నోరెత్తే అవకాశమే లేదు.

అలాగే తెలుగు భాషకు వచ్చేసరికి… నోరు లేపాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కు కూడా ఉంది. కానీ ముందస్తు ఎన్నికల రీత్యా జరిగిన లోపాయికారి ఒప్పందంతో… ప్రస్తుతం ‘మోడీ అండ్ కో’పై ‘కేసీఆర్ అండ్ కో’ విమర్శలు చేసే సాహాసం లేదన్నది బహిరంగమే. ఏ రకంగా చూసుకున్నా… అటు జాతీయ స్థాయిలో, ఇటు ప్రాంతీయంగా ఏ మాత్రం బెరుకు లేకుండా మోడీపై విమర్శల దాడి చేస్తోన్న ఒక్క చంద్రబాబు మాత్రమే!

ADVERTISEMENT
Latest Stories