అన్న ‘సాక్షి’ ఒక్కటే టార్గెట్ లా లేదు!

YS Sharmilaవైఎస్ వివికానందరెడ్డి హత్యపై సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “వివేకానంద రెడ్డి ప్రజల మనిషి. అలాంటి వ్యక్తిపై కొన్ని మీడియా సంస్థలు లేనిపోని అభాండాలు వేస్తూ ఆయన వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నాయి. మన మద్య లేనివ్యక్తి గురించి, తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని వ్యక్తి చిన్నాన్న వివేకానందా రెడ్డి గురించి ఈవిదంగా వ్రాస్తుండటం చాలా దారుణం.

చిన్నాన్న వివేకానందా రెడ్డి పేరుపై ఎటువంటి ఆస్తులు లేవు. ఆయన మొదటి నుంచి అన్నీ సునీత పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించారు. చిన్నాన్న పేరు మీద ఒకటో అరో ఆస్తులున్నా వాటినీ సునీత పిల్లలకి చెందేలా వీలునామా వ్రాయించారు. తనకంటూ ఆస్తులేలేని చిన్నాన్నను సునీతారెడ్డి, ఆమె భర్త ఎందుకు చంపుతారు? ఒకవేళ సునీత భర్త ఆస్తుల కోసమే హత్య చేయాలనుకొంటే ఆస్తులు కలిగి ఉన్న తన భార్య సునీతను హత్య చేయాలి కానీ వివేకానందరెడ్డిని ఆయన ఎందుకు హత్య చేస్తారు?

ADVERTISEMENT

చివరి వరకు ప్రజల కోసమే జీవించిన వ్యక్తి మా చిన్నాన్న వివేకానంద రెడ్డి. ఆయన ఎటువంటివారో మేము చెప్పడం కాదు పులివెందులలో ఎవరిని అడిగినా చెపుతారు. అటువంటి వ్యక్తిని హత్య చేసినందుకు అందరూ బాధపడాలి. కానీ చనిపోయిన ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విదంగా వార్తలు ప్రచురిస్తున్నారు. ఆయన కుమార్తె సునీతారెడ్డికి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డికి ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేకపోయినా కట్టుకధలు అల్లి వారిని కూడా మానసికంగా క్రుంగా దీస్తున్నారు. ఇకనైనా మీడియా సంస్థలు ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలి,” అని అన్నారు.

అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ కాసుకొని కూర్చొన్నప్పుడు వైఎస్ షర్మిల ఈ వ్యాఖ్యలు చేయడం యాదృచ్ఛికం అనుకోలేము. ఈ హత్య కేసుతో సునీతారెడ్డి దంపతులకు ఎటువంటి సంబందమూ లేదని సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అది నూటికి నూరు శాతం వాస్తవమే అని వైఎస్ షర్మిల కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పారనుకోవచ్చు. కనుక ఇటు సీబీఐకి, సునీతా రెడ్డి దంపతులకు అండగా నిలబడుతూనే, మరోవైపు వైసీపీ నేతలను, సాక్షి మీడియాను కూడా వైఎస్ షర్మిల కట్టడి చేసే ప్రయత్నం చేశారని భావించవచ్చు.

వైఎస్ షర్మిల చెప్పిన ఆ మీడియా సంస్థ వైసీపీకి బాకా ఊడుతున్న సాక్షి మీడియా అని వేరే చెప్పక్కరలేదు. ఆమె సాక్షిని ఉద్దేశ్యించి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారనుకోవడానికి లేదు. దానిలో అటువంటి రాతలు రాయిస్తున్నవారిని కూడా హెచ్చరించిన్నట్లు భావించవచ్చు. అవినాష్ రెడ్డి నిరపరాధి అని, సునీతారెడ్డి దంపతులు హంతకులని వాదిస్తున్న వైసీపీ నేతలకు చెంపదెబ్బ కొట్టిన్నట్లు వైఎస్ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలతోనైనా వైసీపీ, సాక్షి మీడియా అవినాష్ రెడ్డిని వెనకేసుకొని రావడం, వివేకా కుటుంబంపై ఆరోపణలు చేయడం మానుకొంటుందో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories