కడప ఎంపీ గా షర్మిల? బాబాయ్ న్యాయం చేయడానికా?

YS Sharmila

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో తన రాజకీయ ఊపిరిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి వైస్ షర్మిల ఎంట్రీతో కాసంత ఉపశమనం దొరికినట్లయింది. గతంలో అన్న గెలుపు కోసం రాజకీయ పోరాటం చేసిన షర్మిల ప్రస్తుతం అన్న ఓటమి కోసం ఆరాటపడుతున్నారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల అటు వైసీపీ వ్యతిరేక ఓటు చీలుస్తారా…? లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తారా..? అనేది అటు వైసీపీ ని ఇటు టీడీపీ కూటమిని వేధిస్తున్న అంశం.

ADVERTISEMENT

అయితే కాంగ్రెస్ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుని చీలిస్తే టీడీపీ కూటమికి అది ప్లస్ అవుతుంది. అదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే అది వైసీపీ కి బలంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి బలహీనతను తగ్గించాలనుకుంటుంది…ఎవరి బలాన్ని పెంచాలనుకుంటుంది అనే దాని పై రాజకీయ పార్టీలకు కూడా ఇప్పటి వరకు ఒక స్పష్టత రాలేకపోతున్నారు.

అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తనవంతు ప్రయత్నాలు తానూ చేస్తానంటూ కాంగ్రెస్ శ్రేణులకు భరోసా ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి 25 అసెంబ్లీ స్థానాలు..5 ఎంపీ స్థానాలు ఇవ్వండి చాలు అంటూ ప్రకటించడంతో ఏపీలో ఎన్ని స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేయబోతున్నది అనే చర్చ మొదలయ్యింది.

అలాగే పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల పోటీ చేయబోయే స్థానం మీద కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర ప్రజానీకం. అయితే షర్మిల కడప ఎంపీ గా అవినాష్ రెడ్డి పై పోటీకి దిగబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనితో అన్నకు వ్యతిరేకంగా రాజకీయం మొదలుపెట్టిన చెల్లి బాబాయ్ హత్యకు న్యాయం చేయనుందా అంటూ ప్రచారం మొదలుపెట్టారు షర్మిల మద్దతుదారులు.

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి శిక్షపడకుండా ఇన్నాళ్లు కాపాడుకొస్తుంది ముఖ్యమంత్రి జగనే అంటూ పరోక్షంగా విమర్శలు చేస్తున్న సునీత, షర్మిల ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి పై ప్రజాతీర్పు కోసం ఎన్నికల బరిలో దిగడం నిజంగా హర్షించదగ్గ విషయమే. పార్టీ అధిష్టానం కూడా కడప ఎంపీగా పోటీ చేయాలనీ అని ఆదేశించడంతో షర్మిల కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం.

ఈ నెల విడుదల చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో కచ్చితంగా షర్మిల పేరు వినపడుతుంది..కనపడుతుంది అనేది స్పష్టమయింది. అయితే దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సిట్టింగ్ ఎంపీ గా ఉన్న వైసీపీ అవినాష్ రెడ్డి ని ఓడించాడనికి కాంగ్రెస్ పార్టీ తరుపున చెల్లి షర్మిల , టీడీపీ తరుపున మాధవి రెడ్డి బరిలో కి దిగనున్నారు. అయితే రానున్న ఎన్నికలలో ఈ త్రిముఖ పోటీ ఆసక్తిగా ఉండబోతుంది. ఇద్దరు నారీమణులు మధ్యన ఎవరి చేతులో ఓటమికి అవినాష్ సిద్ధంగా ఉన్నారో కాలమే సమాధానం చెప్పాలి..!

ADVERTISEMENT
Latest Stories