అన్నా…అన్నా…అంటూ…ఇలా తగులుకున్నావేమమ్మా తల్లి..!

YS Sharmila

వైస్ షర్మిల ఇప్పుడీ ఈ పేరు వింటేనే వైసీపీ ఫ్యాన్ కరెంట్ కట్ అవుతుంది. వందల మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని తనకు అడ్డువచ్చిన, వస్తున్న నేతల పై అది ఆడైన, మగైనా, సొంత వాళ్ళైనా, పరాయివాళ్ళయినా సరే నీచాతి నీచంగా వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ నైజం, ఇటువంటి వారికి డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నారు జగన్ అంటూ అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో వైసీపీ సోషల్ మీడియాను బహిరంగంగా ఉతికి ఆరేశారు వైస్ షర్మిల.

ఇదే షర్మిల గతంలో వైసీపీ పార్టీని భుజాన వేసుకుని రాష్ట్రమంతా పాదయాత్ర చేసింది గుర్తులేదా…? సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమాలు చేసింది మరిచిపోయారా..? తెలంగాణలో జగన్ ఆపేసిన ఓదార్పు యాత్ర చేసింది నేను కాదా జగనన్నా..? అటువంటి నా పై, నా భర్త పై , నా కుటుంబం పై నీచమైన విమర్శలు చేయడం మీకు న్యాయమా జగనన్నా…?

ADVERTISEMENT

ఈ రాష్ట్రంలో ఎవరికీ నచ్చిన పార్టీలో వారు చేరే స్వేచ్చలేదా..? ఆ పార్టీ తరుపున ప్రచారం చేసుకునే హక్కు లేదా..? కాంగ్రెస్ పార్టీ తరుపున మేము అడుగుతుంది ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అని..? ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఏది అని..? ఈ రాష్ట్రానికి కావాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అని…? కానీ జగనన్న మాత్రం వీటన్నికి జవాబు చెప్పడం మానేసే తన సైన్యంతో సొంత చెల్లి పై వ్యక్తిగత విమర్శలు చేపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం జగనన్నా..?

గత ఎన్నికలలో ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసారా..? అధికారంలోకి వచ్చిన వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తాను అన్నారు మీకు ఇంకా వారం గడవలేదా జగనన్నా..? ప్రతిపక్షములో ఉన్నప్పుడు మెగా డీఎస్సీ అన్నావు..అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ళకు దగా డీఎస్సీ ఇచ్చావేం జగనన్నా..? ఇది మోసం కాదా..? ఇది మాట తప్పడం కాదా…మడం తిప్పడం కాదా..? ఇదేనా జగనన్న తెచ్చిన రాజన్న రాజ్యం.

జగనన్న పాలనకు – వైస్సార్ పాలనకు నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. మేము ఇలా అమలు కానీ ప్రభుత్వ హామీల గురించి ప్రశ్నిస్తే ఇలా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారే దేవుడనే వాడు మీకే కాదు మాకు ఉన్నాడు…అంతా చూస్తున్నాడు…నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను…నేను భయపడే రకం కాదు అనేది జగనన్న గుర్తుంచుకోవాలి అంటూ జగన్ ను అన్నా…అన్నా అంటూ ఒక ఆట ఆడుకుంది వైస్ షర్మిల.

షర్మిల జగన్ పైన, వైసీపీ పైన చేస్తున్న విమర్శలు చూస్తున్న, వింటున్న జగనన్న అభిమానులు మాత్రం ఎన్నికల ముందు అన్నా…అన్నా…అంటూ ఇలా తగులుకున్నావేవమ్మా…అంటూ తలలు పట్టుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories