
జగన్ ముఖ్యమంత్రిగా ఎలాగూ ఫెయిల్ అయ్యారు. కనీసం ప్రతిపక్ష నాయకుడుగా అయినా సక్రమంగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నారా? అంటే అదీ లేదు. ప్రధాన ప్రతిపక్షనేత హోదా కావాలని హైకోర్టుకి కూడా వెళతారు కానీ శాసనసభ సమావేశాలకు మాత్రం రారు. ఇప్పుడు తాను ముఖ్యమంత్రిని కాననే విషయం మరిచిన్నట్లు ముఖ్యమంత్రి స్థాయి భధ్రత కల్పించాలంటూ హైకోర్టుకి వెళతారు కానీ ప్రజల మద్యకు రారు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఓటమికి కారణాలు విశ్లేషించుకొని పార్టీ నేతలకు, కార్యకర్తలకు అండగా నిలబడి దిశా నిర్దేశం చేయకుండా మూడు ప్యాలస్‌ల మద్య తిరుగుతుంటారు.
ఎన్నికలలో 60 శాతం మంది ప్రజలు తనని తిరస్కరించినా ఇంకా 40 శాతం మంది మావైపే ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, కనీసం వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడవచ్చు. కానీ శవరాజకీయాలు, అన్నా క్యాంటీన్లు గోల తప్ప మరొకటి పట్టదు.
Also Read – తెలుగు వాడి ఆత్మ గౌరవం…తెలంగాణ నినాదం…!
కానీ కనీసం ఎమ్మెల్యే కూడా కానీ ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. ఇందుకు తాజా నిదర్శనంగా గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గురించి ఆమె చేసిన ట్వీట్ కనపడుతోంది.
వైఎస్ షర్మిల ఏమన్నారంటే, “ముఖ్యమంత్రి@NCBN గారు.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల పక్షాన మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. గ్రూప్2, డిప్యూటీ DEO పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని అనుసరించినట్లే, గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలి.
Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!
గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం, కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు జరగడం, గ్రూప్ 1 సిలబస్‌ను రివిజన్ చేయలేకపోవడం,కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడం లాంటి కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు.
అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై వెంటనే సాధ్యసాద్యాలు పరిశీలించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం@JaiTDP ,” అని ట్వీట్ చేస్తూ ఓ లేఖను కూడా పోస్ట్ చేశారు.
Also Read – ఒకేసారి అన్ని హంగులతో అమరావతి.. అందరూ రెడీయేనా?
ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడమే ప్రతిపక్షపార్టీలు, వాటి నాయకుల బాధ్యత. కనీసం ఎమ్మెల్యే కూడా కానీ వైఎస్ షర్మిల ప్రతిపక్ష నేతగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షనేత హోదా కావాలని పట్టుబడుతున్న జగన్ మాత్రం ప్యాలస్‌లో నుంచి బయటకు రారు. అన్న కంటే చెల్లే నయం అని జనం అనుకోకుండా ఉంటారా?
ముఖ్యమంత్రి @NCBN గారు.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల పక్షాన మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. గ్రూప్2, డిప్యూటీ DEO పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని అనుసరించినట్లే, గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలి. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలకు మధ్య సమయం… pic.twitter.com/EK57nmNnyK
— YS Sharmila (@realyssharmila) August 18, 2024