
వైస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వైస్ జగన్, వైస్ షర్మిల తన తండ్రి ఛరిష్మాను ఏస్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకువచ్చారో చూస్తే నిజమైన వైస్సార్ అభిమానులు సైతం తల పట్టుకుంటారు. అన్నకు పదవి పిచ్చే తప్ప ప్రజలు పట్టరని, చెల్లికి సెన్సేషనే తప్ప సెన్స్ ఉండదని మరోసారి నిరూపించుకున్నారు.
Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!
విజయవాడలో వచ్చిన వరదకు ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు చేసిన బురద రాజకీయం చూస్తుంటే, జగన్ వంద మంది సలహాదారులను ఎందుకు పెట్టుకున్నారో.? షర్మిల ఆడ పిల్ల..ఈడ పిల్ల అంటూ రెండు రాష్ట్రాల మధ్య తీరం తెలియని ప్రయాణం ఎందుకు చేస్తుందో ఇప్పుడు అర్ధమవుతుంది.
అన్నేమో వరద బాధితులకు కోటి విరాళమంటాడు, కానీ ఎప్పుడిస్తాడో, ఎలా ఇస్తాడో చెప్పనంటాడు. చెల్లెలేమో వరద బాధితులకు ఒక్కొక్కరికి కనీసం కూటమి ప్రభుత్వం లక్ష రూపాయిల పరిహారం ఇవ్వాల్సిందే, ప్రభుత్వం ఎప్పుడిస్తుందో చెప్పమంటుంది.? అసలే గత ఐదేళ్ల నుంచి రాజధాని లేక, పెట్టుబడులు రాక అప్పులతో, తాకట్లతో కాలం నెట్టుకొస్తున్న పరిస్థితి.
Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?
వైసీపీ హయాంలో రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఏపీ మరో పదేళ్లయినా కోలుకోలేని దుస్థితి. ఈ పాపానికి వైస్ షర్మిల కూడా కారుకులే అన్న సత్యాన్ని మరిచి ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలిగా మారి ముఖ్యమంత్రి బాబు పై విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల దోచేసింది అంటున్న షర్మిల ఆ దోపిడీకి మూల స్తంభం కాదా .? ఆ పాపంలో తన భాగం లేదా.?
మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని నోటికి వచ్చిన అంకే చెప్పి పరిహారం ఇచ్చేయండి అంటే అది సాధ్యమా.? జగన్ బాధితుల సహాయార్థం ఇస్తాను అని ప్రకటించిన కోటి రూపాయిలు ఇప్పటికి అటు ప్రభుత్వానికి కానీ ఇటు బాధితులకు కానీ చేరలేదు. అలాగే ఇంత విధ్వంసం కళ్ళ ముందు చూసి కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున కానీ తన వ్యక్తిగతంగా కానీ షర్మిల బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం ప్రకటించలేదు. మరి దీన్నేమనాలి.?
Also Read – భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!
వచ్చిన విపత్తు నష్టం మొత్తం ప్రభుత్వమే భరించాలి అనేది వాస్తవ రూపంలో ఎప్పటికి సాధ్యం కాదు. అది రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా మోయలేని భారమే అవుతుంది. జగన్ లాగ ప్రకటించి చేతులు దులుపుకుంటే చాలు అనుకుంటే షర్మిల చెప్పినట్లు ఒక్కొక్కరికి లక్ష కాదు కోటి రూపాయలైన ప్రకటించవచ్చు. కానీ అలా చేస్తే ప్రజలలో విశ్వసనీయత పోయి జగన్ కు ఇచ్చినట్టు ఒక్క ఛాన్స్ యే మిగులుతుంది.
అయినా కూటమి ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వెయ్యడం లేదు. ఇంటింటికి నిత్యావసరాలు సరఫరా చేస్తూనే వారికి అత్యవసరమైన వసతులను తిరిగి పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది. మోటర్ వెహికల్స్ ఇన్సూరెన్స్ మొదలుకుని గృహోపకరణలైన ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్ వంటి రిపేర్స్, ఇళ్ళ శుభ్రాల వరకు ప్రభుత్వందే బాధ్యత అంటూ ముందుకొచ్చింది.
అలాగే అన్ని వ్యాపార సంస్థలను తమవంతు బాధ్యతగా బాధితులకు కష్ట కాలంలో సాయమందించమని పిలుపు నిచ్చింది. ఇంత చేసినా ఇంకా చేయాల్సింది చాలానే ఉంది మాకు సాధ్యమైనంత చేసి తీరుతాం అంటూ బాధితులకు హామీ ఇచ్చి అందుకు తగ్గ కార్యచరణను సిద్ధం చేస్తుంది.
ప్రభుత్వం ఇంత చేస్తున్నా మేము విపక్షంలో ఉన్నాం కదా అని విపత్తుని మాన్ మెయిడ్ ఫ్లడ్స్ అంటు జగన్, ప్రజలు నుంచి ప్రభుత్వాలు విరాళాలు తీసుకోవడం పబ్లిసిటీ స్టంట్ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఈ ఇద్దరు అన్నా చెల్లెల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరికిన “ఆణిముత్యాలే” అనక తప్పదేమో మరి..!