జగన్ లాజిక్ లెస్ సమాధానాలకు…సునీతా లాజికల్ ప్రశ్నలు…!

YS Sunitha

నిన్న కడప జిల్లా పొద్దుటూరులో వైసీపీ నిర్వహించిన మేము సిద్ధం కార్యక్రమంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వివేకా హత్యకు కారకులైన వారిని బాబు నెత్తిన పెట్టుకున్నారు, రాజకీయ పదవుల స్వార్థంతో నా వాళ్ళు ఒకొకరిద్దరు బాబు మాయలో పడిపోయారు అంటూ దస్తగిరిని, సునీత, షర్మిలను ఉద్దేశించి చేసిన కీలక వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు సునీత.

వివేకం బాబాయ్ ని అత్యంత కిరాతకంగా చంపింది నేనే అంటూ మీడియా ముందు బాహాటంగా చెపుతున్న వ్యక్తులకు మద్దతిస్తుంది చంద్రబాబే అంటూ జగన్ ఇచ్చిన సమాధానానికి వివేకా కూతురు సునీత కొన్ని లాజికల్ ప్రశ్నలను జగన్ కు కౌంటర్ గా సంధించారు. చంపింది నేనే అంటూ చేసే వ్యాక్యలను సమర్థిస్తున్న మీరు, చంపించింది ఎవరో అంటూ చేస్తున్న ప్రకటనలను నమ్మలేకపోతున్నారా..?

ADVERTISEMENT

అంటే మీకు అవసరమైనంత మేరకే ఆ వ్యక్తి మాటలను నమ్ముతారా..? చంపింది నేనే అని చెప్పిన వ్యక్తి, చంపించింది వైస్ భాస్కర్ రెడ్డి, వైస్ అవినాష్ రెడ్డి అని, ఆయనకు అండగా నిలబడుతున్నది వైస్ జగన్, వైస్ భారతి రెడ్డి అంటూ చేస్తున్న ప్రకటనలను పట్టించుకోరా..? చిన్నాన్న హత్యను అడ్డుపెట్టుకుని ఒకసారి ఎన్నికలలో పదవులు పొందిన మీరు మళ్ళీ ఆ పదవులను నిలబెట్టుకోవడానికి చిన్నాన్న హత్య అంటూ కుంతీ సాకులు చెప్పడానికి సిద్దమయ్యారా..?

సినిమాలలో చూస్తుంటాం విలన్ ఉంటాడు వాడి పక్కన రౌడీలు ఉంటారు…రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా..? మూల కారకులైన విలన్ దగ్గరకు వెళ్లాలా..? ఈ హత్య కేసులో విలన్ మీరా అంటూ జగన్ ను సూటిగా ప్రశ్నించారు సునీత. నా తండ్రి చావుకి న్యాయం కోసం పోరాడుతున్న నా మీద కేసులు పెట్టడం మీకు న్యాయమా..? నేను పోరాడుతుంది న్యాయం కోసం…మీరు అడ్డుపడుతుంది పదవుల కోసం.

హత్య జరిగి ఐదేళ్లవుతుంది… అలాగే మీకు అధికారం వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తుంది. ఈ ఐదేళ్లలో ఏ నాడు గుర్తు రాని చిన్నాన్న మళ్ళీ ఎలక్షన్స్ ముందు గుర్తొచ్చాడా..? రాజకీయ అవసరాల కోసం హత్య రాజకీయాలను వెనకేసుకొస్తుంది ఎవరు..? పదవులు కాపాడుకోవడం కోసం నేరస్తులను కాపాడుతుంది ఎవరు..? మీరా మా పై ఆరోపణలు చేసేది అంటూ జగన్ వైఖరిని ఎండగట్టారు.

వివేకా రెడ్డి ని హత్య చేసింది ఎవరో ఆ దేవునికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసు అంటూ జగన్ చేసిన వ్యాక్యలకు అవును జగన్ అన్నా మీరు చెప్పింది నిజమే అయితే వారితో పాటు ఈ హత్య చేసింది ఎవరో మీకు కూడా తెలుసు అందుకే వారికి శిక్ష పడకుండా ఇన్నాళ్ళనుండి అడ్డుపడుతున్నారు. అధికారంలో ఉంటూ ప్రతిపక్షం మాదిరి మాట్లాడడం మీకు న్యాయమా..?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వయిరీ అడిగిన జగన్ అన్నా.., అధికారం రాగానే ఎందుకు ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఎంక్వయిరీ చేస్తే మీ పేరు బయటకొస్తుంది అని భయపడ్డారా..? హత్య చేసిన వ్యక్తులను పక్కన పెట్టుకుని వారికీ ఓటు వేయమని అడగడానికి మీకు సిగ్గుగా లేదా..? ఇటువంటి పార్టీ కి ఇటువంటి నాయకులకు ఓటు వేయకండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సునీత.

సునీత చెప్పినట్లే జగన్ అధికారం లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తున్నా ఏనాడు వివేకా హత్య గురించి బహిరంగ వేదికల మీద ప్రసంగించలేదు. ప్రతిపక్ష పార్టీల నేతలు, వివేకా కుటుంబ సభ్యులు, హత్య చేసినట్లు చెప్పుకుంటున్న దస్తగిరి అందరు ఈ హత్య వెనుక జగన్, భారతి, అవినాష్ ఉన్నారంటూ విమర్శలు చేస్తున్నా, హూ కిల్డ్ బాబాయ్…? అంటూ బాబు ప్రశ్నిస్తున్నా ఎన్నడూ స్పందించని జగన్ ఎన్నికల నగర మోగగానే దానికి సంజాయిషీ ఇవ్వడానికి, నేరం మొత్తం పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తునడం చూస్తుంటే చావులతో
రాజకీయం వైసీపీ డిఎన్ఏ లో భాగమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories