మోడీపై దుష్ప్రచారమా? జగన్ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది

Jagan _Narendra Modiమద్యం షాపులు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు రేగింది. కరోనా కారణంగా రాష్ట్ర ఖజానా నిండుకోవడంతో డబ్బులు కోసం మద్యం షాపులు ఓపెన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తాగనివ్వకుండా చేస్తాం అంటూ రేట్లు కూడా పెంచింది. అయితే అవేమీ మందుబాబులను ఆపలేదు. రాష్ట్రంలోని ప్రతీ వైన్ షాపు ముందు జనాలు బారులు తీరారు.

వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తే పై నుండి కింద దాకా వణుకు ప్రారంభం కావడం ఖాయం. రానున్న రోజులలో కరోనా విలయతాండవం చేస్తుంది అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అంటూ పలువురు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. తమ సోషల్ మీడియాని యాక్టీవ్ చేసింది.

ADVERTISEMENT

మద్యం డబ్బులతో ఒక పక్క రాష్ట్ర ఖజానా నింపుకుంటూ… మోడీ గారూ వైన్ షాపులకు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు అంటూ నిందను కేంద్ర ప్రభుత్వం మీదకు గెంటేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం రాష్ట్ర బీజేపీ యూనిట్ కేంద్రానికి కంప్లయింట్ చేసినట్టు సమాచారం. దానితో ప్రధాని కార్యాలయం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తో మాట్లాడినట్టు సమాచారం.

“కేంద్రం రాష్ట్రాల అభ్యర్ధనపై మద్యం షాపులు తెరవచ్చు అని చెప్పింది. అయితే ఎక్కడా తెరిచి తీరాలి అనలేదు. మద్యం అమ్మకం అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం. పైగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మా మీద చేస్తున్న దుష్ప్రచారానికి జగన్ పార్టీ తొందరలోనే భారీ మూల్యం చెల్లిస్తుంది,” అని ఒక బీజేపీ నాయకుడు చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories