ys-jagan-cash transfer

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వచ్చే ఐదేళ్ల ఎన్నికలకు అవసరమైన ఓటు బ్యాంకు రాజకీయాన్ని మొదలుపెట్టిన జగన్ ముఖ్యమంత్రి పదవి అంటే కేవలం సంక్షేమ కార్యక్రమాలకు బటన్ నొక్కడమే అన్న సిద్దాంతంతో పాలన కొనసాగించారు.

ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు ప్రజా సమస్యలను గాలికొదిలి వచ్చే ఐదేళ్ల అధికారం కోసం పాదయాత్ర చేసిన జగన్ అధికారం చేతికందగానే తాడేపల్లి ప్యాలస్ గడప దాటి బయటకు రాలేదు అంటే అతిశయోక్తి లేదు. చెట్లను నరుకుతూ, పరదాలు కట్టుకుంటూ బటన్ నొక్కడానికే బయటకు వచ్చిన జగన్ తానూ రాష్ట్రానికి ఇప్పటికే చాలా చేశాను అనే భ్రమలో మిగిలిపోయారు.

Also Read – ఐసీయూ లో ఉన్న వైసీపీకి చిరు ఊతమిస్తే…టీడీపీ ఊపిరి తీసింది.!

ఈ బటన్ నొక్కడమే వైసీపీ ఎన్నికల నినాదంగా ముందుకెళ్లిన జగన్ తానూ ఐదేళ్లుగా మీ కోసంఎన్నో సార్లు బటన్ నొక్కాను నా కోసం మీరు పోలింగ్ బూత్ లో ఒక్కసారి ఫ్యాన్ బటన్ నొక్కండి అంటూ ఏపీ ఓటర్లను వైసీపీ బుట్టలో వేయడానికి అవసరమైన స్క్రిప్ట్ ఫాలో అయ్యారు జగన్.

అమ్మ ఒడి కోసం , చేయూత కోసం, ఆసరా కోసం, జగనన్న విద్యా దీవెన, రైతు బంధు ఇలా సంక్షేమ కార్యక్రమాల కోసం ఎన్నో జగన్ బటన్లు నొక్కారు. దీనికి రిటర్న్ గిఫ్ట్ కింద ఏపీ ప్రజానీకం మరోసారి జగన్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి బటన్ నొక్కుతారు అని ఆశించిన జగన్ కు తమ ఓటు తో ఊహించని షాక్ ఇచ్చారు ఏపీ ఓటర్లు.

Also Read – అయ్యో పాపం వైసీపీలు… చెవిలో ఎలా పూలు పెట్టేస్తున్నాడో!

ప్రభుత్వ భవనాలకు, కరెంట్ పోల్స్ కు, చెట్లకు, గోడలకు ఇలా ఏ ఒక్కటి వదిలి పెట్టకుండా ఒకరకంగా రాష్ట్రమంతా వైసీపీ రంగులు వేసి, జగన్ పోస్టర్లు పాతి ప్రతి నిముషం ప్రజలకు వైసీపీ పార్టీని, జగన్ ను గుర్తు చేస్తూనే ఉన్నారు జగన్. రాజధానిని కూల్చి, అభివృద్ధిని సమాధి చేసి, పరిశ్రమలను తరిమేసి, రోడ్లు – మౌలిక వసతులను పట్టించుకోకుండా ఈ ఐదేళ్లు ప్రజల ఓపికకు, ఓర్పుకు పరీక్ష పెట్టారు జగన్.

ఇటు ప్రతిపక్ష పార్టీల నేతల పై కేసులు పెట్టి, అరెస్టులు చేసి జైలుకు పంపించి వారి కుటుంబాలను మానసికంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టిన జగన్ ఐదేళ్లుగా పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. దీనితో ఇటు సామాన్యుడితో పాటు అటు కూటమి పార్టీ మద్దతుదారులు కూడా బటన్ నొక్కడం కోసం నిరీక్షించారు. వారి నిరీక్షణకు సమయం రావడంతో కూటమి పార్టీ గుర్తుల పై 164 సీట్లలో బటన్ నొక్కి వైసీపీ ఫ్యాన్ పీక నొక్కారు ఓటర్లు.

Also Read – వైసీపీకి టీడీపీ పెర్‌ఫెక్ట్ సమాధానాలు… బావున్నాయి!

ప్రజలు నొక్కిన బటన్ తో జగన్ తో పాటుగా ఆ పార్టీ నాయకుల గొంతు నొక్కుకుపోయింది. మీడియా ముందుకొచ్చి నోటికి హద్దు అదుపు లేకుండా వాగే ప్రతి వైసీపీ నేతకు ఇప్పుడు నోటి నుంచి ఒక్క మాట కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇన్నాళ్లుగా బటన్ నొక్కా.. బటన్ నొక్కా అనుకుంటే 11 సీట్లు ఇచ్చి ఏపీ ఓటర్లు వైసీపీ పీకనొక్కారు అనేది ఈ రోజు ప్రజా తీర్పుతో స్పష్టమయింది.