జనసేన… బీజేపీ దోస్తీ పై వైఎస్సార్ కాంగ్రెస్ జోకులు

Somu Veerraju - Pawan Kalyanజనసేన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ తాము తిరుపతి ఉపఎన్నికలో పోటీ చెయ్యబోతున్నట్టు ప్రకటించేసింది. దీనితో తమను బీజేపీ లోకువగా చూస్తుందని జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అది చాలన్నట్టు దీనిని వాడుకుని అధికార పార్టీ వారు జనసైనికులను సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారు.

“జనసేన-బీజేపీ జాయింట్ కమిటీ తిరుపతి ఉపఎన్నిక పూర్తిగా అధ్యయనం చేసి రెండు ఆప్షన్స్ చెప్పింది… 1. బీజేపీ పోటీ చేసి జనసేన మద్దతు ఇవ్వటం. 2. జనసేన మద్దుతుతో బీజేపీ పోటీ చేయడం. ఆప్షన్ తీసుకునే తుది నిర్ణయం జనసేనాని కే వదిలేయడం జరిగింది,” అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా ఇంఛార్జ్ గుర్రం దేవేంద్ర రెడ్డి ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

ADVERTISEMENT

ఈ ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. దానితో అధికార పార్టీ వారు జనసేనను ఎద్దేవా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా…. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా ఇంఛార్జ్ గుర్రం దేవేంద్ర రెడ్డికి అధికారంలోకి రాగానే జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ గా నామినేటెడ్ పదవి ఇచ్చారు.

ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇంకో పార్టీని విమర్శించడం ఏంటని జనసైనికులు విమర్శిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా… తమను తక్కువగా చూస్తున్న బీజేపీకి సరైన మెస్సేజ్ పంపితే తప్ప ఇటువంటివి ఆగవని పలువురు జనసైనికులు పవన్ కళ్యాణ్ కి ట్వీట్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories