చంద్రబాబుపై కేసులతో నష్టపోతుంది ఎవరు?టిడిపి… వైసీపి?

YS_Jagan-Chandrababu-Naidu

వైసీపికి ఉన్న మెజార్టీతో, అది అమలుచేస్తున్న సంక్షేమ పధకాలతో టిడిపి, జనసేనలను చూసి భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకో భయపడుతోంది. ఆ అభద్రతాభావంతోనే చంద్రబాబు నాయుడుపై ఏదో పేరుతో కేసులు పెట్టి ఎన్నికలు పూర్తయ్యేవరకు జైలులో ఉంచుదామనుకొంది.

కానీ అనుకొన్నది ఒకటీ జరిగినది మరొకటి. టిడిపికి చంద్రబాబు నాయుడుని దూరం చేసి బలహీనపరుద్దామని, ప్రజలకు దూరం చేసి తాము దగ్గరవాలని వైసీపి అనుకొంది. కానీ చంద్రబాబు లేనప్పుడు పార్టీని ఎలా నడిపించాలో టిడిపి నేతలు నేర్చుకోగలిగారు. రెండు నెలలు జైల్లో ఉన్నందుకు చంద్రబాబుపై ప్రజలలో సానుభూతి ఏర్పడింది. వైసీపి ఈ విషయం కాస్త ఆలస్యంగా గ్రహించింది. అందుకే నారా లోకేష్‌ని అరెస్ట్ చేయడానికి వెనకడుగు వేసింది.

ADVERTISEMENT

అయితే చంద్రబాబు నాయుడుని మరో కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఆయనపై ‘ఆర్ధిక నేరగాడు’ అనే ముద్రవేయగలిగితే, ఈ సానుభూతి ఓట్లను తగ్గించుకోవచ్చని వైసీపి ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. అందుకే మళ్ళీ కేసుల వరద మొదలైంది. కానీ వైసీపి ఓ అతిముఖ్యమైన విషయం గ్రహించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఆనాడు ఢిల్లీ పెద్దలు మౌనంగా ఉండిపోయినందునే తాము చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయగలిగామని, సుమారు రెండు నెలలు జైల్లో పెట్టగలిగామని, కానీ తెలంగాణలో బీజేపీ, జనసేనల పొత్తుల తర్వాత ఢిల్లీ పెద్దల ఆలోచనలో ఏదో మార్పు వచ్చిందని కనుకనే చంద్రబాబు నాయుడుని పట్టి బందించి ఉంచలేకపోతున్నామని గ్రహించిన్నట్లు లేదు.

అయితే చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు మోపి, అరెస్ట్ చేయడం వలన వైసీపి ఆశించిన ఫలితం దక్కకపోగా, ఇలా ఒక్కో కేసులో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా తీర్పులు వస్తే, చివరికి తామే నష్టపోతామని వైసీపి ఇంకా గ్రహించిన్నట్లు లేదు. అందుకే చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకి పరిగెత్తింది. అక్కడ వైసీపికి ఎటువంటి జవాబు వస్తుందో ఊహించుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories