ఇదిగో… పరిశ్రమలను ఇలా తరిమేస్తాం!

YSRCP Government Cases On Sangam Dairy

వైసీపి ప్రభుత్వం ఆంధ్రాకు కొత్తగా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు తేలేకపోయినా కనీసం ఉన్నవాటిని కాపాడుకొంటున్నా, ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవి. కానీ పరిశ్రమలను కూడా రాజకీయ కోణంలో నుంచే చూస్తూ వేధింపులకు గురి చేస్తుండటం, ఐ‌టి కంపెనీల కోసమే ప్రత్యేకంగా విశాఖలో నిర్మించిన మిలీనియం టవర్స్‌లో వాటిని కాదని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొంటుండటం చూస్తున్న పారిశ్రామికవేత్తలు, ఐ‌టి కంపెనీలు ఆంధ్రా వైపు కన్నెత్తి చూస్తారా?

రాష్ట్రంలో టిడిపి ముఖ్యనేతల ఆర్ధిక మూలాలను దెబ్బతీయడం ద్వారా వచ్చే ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితి కల్పించాలనే వైసీపి దురాలోచనతో చేస్తున్న ప్రయత్నాలను అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ దశాబ్ధాలుగా విజయవంతంగా నడుస్తున్న పరిశ్రమలను, అవి టిడిపి నేతలకు చెందినవి కనుక రాజకీయకారణాలతో వేధిస్తుండటం సరికాదని, ఇది రాష్ట్రానికి రావాలనుకొనే పారిశ్రామికవేత్తలకు తప్పుడు సంకేతాలు పంపిస్తోందని టిడిపి వాదనలు చెవిటివాడి ముందు శంఖం ఊదిన్నట్లే అయ్యింది.

ADVERTISEMENT

గుంటూరులో దశాబ్ధాలుగా విజయవంతంగా నడుస్తున్న సంగం డెయిరీని వేధిస్తుండటం ఇందుకు మరో తాజా ఉదాహరణ. సంగం డెయిరీ చేసిన పాపం ఏమిటంటే టిడిపి సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర అధ్వర్యంలో నడుస్తుండటమే!

ఈ నెల 15న సంగం డెయిరీ సమీపంలో కొందరు వ్యక్తులకు, రైతులకు మద్య తోపులాట జరిగినప్పుడు పోలీసులకు గాయాలయ్యాయట!వారి విధులకు ఆటంకం కలిగించారట! అందుకే ధూళిపాళ నరేంద్రతో సహా సంగం డెయిరీ ముగ్గురు డైరెక్టర్లు, 14 మంది ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ధూళిపాళ నరేంద్రపై ఏకంగా హత్యానేరం కింద కేసు నమోదు చేశారు!

విజయవంతమైన ఓ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ నరేంద్రపై చేబ్రోలు పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేయడం చూసి, ఏ పారిశ్రామికవేత్త అయిహ్నా రాష్ట్రానికి వచ్చేందుకు సాహసిస్తాడా? పరిశ్రమలకు అండగా నిలిచి వాటిని కాపాడుకోవలసిన ప్రభుత్వమే వాటిపై ఈవిదంగా వేధిస్తుంటే రాష్ట్రంలో పరిశ్రమలు ఏవిదంగా నడుస్తాయి?

ADVERTISEMENT
Latest Stories