అంబటి ‘కాపు టైగర్’ అయితే మరి పేర్ని.?

YSRCP ‘Kapu Tiger’ Row: Perni Nani Angle

వైసీపీ తన రాజకీయానికి మత రంగుతో పాటు కుల రంగు కూడా పూస్తుంది. తిరుమల శ్రీవారి క్షేత్రం కేంద్రంగా మత రాజకీయాలకు భీజాలు వేసిన వైసీపీ అంబటి అరెస్టు వ్యవహారంతో కుల రాజకీయాలకు శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుకి వైసీపీ అధినేత ‘కాపు టైగర్’ బిరుదిని ప్రధానం చేసారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా అంబటి రాంబాబు ని నాటి కాపు నాయకుడు రంగా తో సరిపోల్చుతూ ప్రచారం చేసారు.

ADVERTISEMENT

ఇలా అంబటి రాంబాబు ఒక్క వివాదంతో వైసీపీ లో కాపు హీరో అయిపోయారు. అలాగే వైసీపీ కాపు నేతలకు లీడర్ అయిపోయారు. అయితే జగన్ కు నేను పెద్ద పాలేరు అంటూ తన స్థాయిని తానే దిగజార్చుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కూడా అదే కాపు సామాజికవర్గానికి చెందినవాడు.

మరి జగన్ మెప్పు కోసం ఆయన సొంత సామాజికవర్గాన్ని సైతం కించపరిచడానికి వెనుకాడని పేర్ని స్వామి భక్తికి జగన్ పేర్ని నాని కి ఇంతవరకు ఒక్క బిరుదు కూడా ఇవ్వలేదు. అంటే జగన్ నుంచి అందగాళ్ళు, టైగర్ లు అనే బిరుదు పొందాలి అంటే వైసీపీ సిలబస్ ప్రకారం సదరు నాయకుడు అరెస్టయ్యి జైలుకు వెళ్లాల్సిందేనా.?

అలా అరెస్టయిన నేతలకు మాత్రమే జగన్ ఇటువంటి బిరుదులు ప్రధానం చేస్తారా.? మరి పేర్ని నాని కూడా కాపు సింహం గానో, మరో వైసీపీ అందగాడిగానో జగన్ నుంచి బిరుదు అందుకోవాలంటే ఆయన కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందేనా.? మరి అందుకు పేర్ని ఇంకెంత దిగజారి రాజకీయం చెయ్యాలో.? ఇంకెవరిని కించపరుస్తూ బూతులు తిట్టాలో..!

ADVERTISEMENT
Latest Stories