
వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిత్యం ఏదోక వివాదంలో నిలుస్తూనే ఉన్నారు. కొన్ని నెలల ముందట తన అసభ్యకర వీడియోతో పార్లమెంట్ లో సైతం తన పేరు వినిపించేలా చేసి ‘హిందూపురం ఎంపీ గా హస్తినాపురం’ వరకు ఫేమస్ అయ్యారు గోరంట్ల మాధవ్.
చంద్రబాబు అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఆయన జైల్లోనే చనిపోవడం, జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ ఒక ప్రతిపక్ష నేత చావు ని కోరుకుంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచాడు ఈ ప్రబుద్దుడు. గతంలో కూడా తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం వంటి విచిత్ర చేష్టలతోనే జగన్ దృష్టిని ఆకర్షించారు. ఈ విన్యాసాలతో జగన్ ను ఆకట్టుకున్నఎంపీ టికెట్ పొందిన మాధవ్ ఇక ప్రజల పనిపట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టున్నారు.
అయితే తాజాగా జరిగిన కురుబ సంఘాల వారు ఏర్పాటు చేసిన సభకు హాజరైన వైసీపీ ఎంపీ గోరంట్ల మరో వివాదాన్ని వెతుకున్నారు. ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాను అనే కనీస ఇంగితం కూడా లేకుండా ఆ సభలో ఆయన గారు ప్రవర్తించిన తీరు సభలో పాల్గొన్న ఆ సామజిక వర్గ పెద్దలకే విసుగు తెప్పించిందనే చెప్పాలి.
సినిమాలో చెప్పినట్టు 5 రూపాయల ఫ్యాక్షన్ గొడవల మాదిరి పూల దండ కోసం ఆయన చేసిన విన్యాసాలు అన్ని ఇన్ని కావు. టీడీపీ నేత బీకే పార్థసారధికి కురుబ సంఘం నేతలు గజమాలతో సన్మానం చేయడంతో తట్టుకోలేని వైసీపీ నాయకులు ఉష శ్రీ, గోరంట్ల మాధవ్ సభను సజావుగా సాగనీయక అక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు.
కాసేపు సభా ప్రాంగణంలో ఏం జరుగుతుందో అర్ధం కానీ స్థానిక ప్రజలు, కుల సమావేశాలలో కూడా పార్టీల మధ్య వైరాలు సృష్టించడం ఏంటో? తమ అధికార దర్పాన్ని ప్రదర్శించడం ఎందుకో? అంటూ గోరంట్ల ప్రవర్తనను తప్పుబడుతున్నారు.అయితే పోలీస్ అధికారులు, స్థానిక నేతలు ఇరు వర్గాలకు సద్దిచెప్పి పరిస్థితిని చక్క దిద్దే ప్రయత్నం చేసిన మాట వినని అధికార పార్టీ ఎంపీ గారు సభా ప్రాంగణాన్ని వదిలి వెళ్లిపోయారు.
సభా మర్యాద కూడా పాటించడం చేతకాని గోరంట్ల మాధవ్ ప్రవర్తన చూసిన వారు ఓ మాధవా… నువ్విక మారవా? అంటూ నిట్టూరుస్తున్నారు.ఇటువంటి వివాదాస్పద చర్యలకు పాల్పడకుండా వైసీపీ అధిష్టానం మాధవ్ ను కట్టడి చేయలేకపోతుందా? లేక అధిష్టాన పెద్దల ఆశీస్సులు, ఆదేశాలతోనే మాధవ్ రెచ్చిపోతున్నారా? అనేది ఎన్నికలలో పార్టీ సీట్ల పంజారం వరకు వేచి చూడాల్సిందే.