సాక్షి మీద నమ్మకం లేదా?

vijayasai-reddy-sakshi

గత రెండు రోజుల నుంచి అటు సోషల్ మీడియా వార్తలలోనూ, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలలోనూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు వైసీపీ ముఖ్యనాయకుడు విజయ సాయి రెడ్డి. ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినితో విజయ సాయికి ఉన్న అక్రమ సంబంధం అంటూ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో నిలిచాయి.

ADVERTISEMENT

అయితే ఆ ఆరోపణలు మీద స్పందించడానికి మీడియా ముందుకొచ్చిన సాయికి తన ఆక్రోశాన్ని వెళ్లబుచ్చారు. ఇలా తన పై అకారణంగా లైంగిక ఆరోపణలు నింద వేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అంటూ పరోక్షంగా ఒక మీడియా ఛానల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వచ్చిన ఆరోపణలలో నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా వార్తలు ప్రచారం చేయడం హీనమైన చర్య అని, ఇటువంటి వార్తలను ప్రచారం చేస్తున్న మీడియాకు ధీటుగా మరో కొత్త ఛానల్ పెడతానంటూ సాయి సవాల్ చేసారు. అలాగే సాయి రెడ్డి మీద వచ్చిన ఆరోపణలను ఖండించడానికి వైసీపీ ముఖ్య నేతలెవ్వరూ మీడియా ముందుకు రాలేకపోతున్నారు వై?

సొంత ఛానల్ అంటూ సాయి చేస్తున్న హడావుడి చూస్తుంటే సాయికి సాక్షి మీద నమ్మకం తగ్గిందా? లేక జగన్ మీద విశ్వాసం సడలిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైసీపీ సాక్షి మీడియాలో సాయి రెడ్డి మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కథనాలు ప్రచారం చెయ్యలేదా.? లేక వైసీపీ నేతల మధ్య మొదలైన అంతర్గత పోరులో సొంత పార్టీ నేతలే ఈ గుట్టును బయటపెట్టారా.? అనేది తేలాల్సి ఉంది.

అయితే ఈ వయస్సులో నా మీద ఇటువంటి ఆరోపణలు చేస్తారా? అంటూ మండిపడుతున్న విజయ సాయికి గత ఐదేళ్లల్లో వైసీపీ చేసిన పాపాలు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. అకారణంగా రాజకీయాలతో సంబంధం లేని నారా భువనేశ్వరి పై నిండు అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు నిందలు వేసింది, దాన్ని సాక్షి ప్రచారం చేసింది సాయి మరిచారా.?

నారా చంద్రబాబు ను కించపరచాలి అనే ఏకైక లక్ష్యంతో పురంధరేశ్వరిని అడ్డుపెట్టుకుని బావ మరదలు, వదిన మరిది అంటూ తన సోషల్ మీడియాలో సాయి అస్లీల పోస్టులు చెయ్యలేదా.? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ నుండి సాయి వరకు ఆరోపణలు చేసిన మాట వాస్తవం కాదా? వాటి మీద సాక్షిలో డిబేట్లు పెట్టింది నిజం కాదా?

రామోజీ రావు వంటి అక్షర యోధుడు ని సైతం ఒక ఏడాది పాటు నా ట్వీట్లతో వేధించా అంటూ సగర్వంగా చెప్పుకుంటున్న విజయ సాయి నొప్పి తనదాకా వస్తే సొంత పార్టీ నేతలను సైతం ఎదిరిస్తా, ఛానల్ పెట్టే విషయంలో జగన్ చెప్పినా ఇక ఉపేక్షించే పని లేదు అంటూ సవాళ్లు చేస్తున్నారంటే సాయి రెడ్డి ఏ విలువలకు కట్టుబడి రాజకీయం చేస్తున్నట్టు.

అధికారంలో ఉన్నన్ని రోజులు ఎదుటి వారి మీద సోషల్ మీడియాలో బురద జల్లి కడుక్కోవాల్సిన బాధ్యత మీదే అంటూ విర్రవీగిన విజయ సాయి ఇప్పుడు మాత్రం మీడియాలకు విలువలుండాలి, సోషల్ మీడియాకు పరిమితులుండాలి అంటూ ప్రవచనాలు వల్లెవేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories